Thatikonda Rajaiah : రైతు బంధు చైర్మన్ గా రాజయ్య
ఈసారి ఎన్నికల్లో టికెట్ నిరాకరణ
Thatikonda Rajaiah : తెలంగాణ – రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం మూడు రాష్ట్ర స్థాయి సంస్థలకు చైర్మన్లను నియమించింది. బీఆర్ఎస్ బాస్, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తగా చైర్మన్లుగా నియమితులైన వారిలో ప్రస్తుతం ఆయా నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
Thatikonda Rajaiah As a Rythu Bandhu Chairman
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ గా ముత్తి రెడ్డి యాదగిరి రెడ్డిని నియమించారు కేసీఆర్. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు ఇదే సంస్థకు చైర్మన్ గా ఉన్న బాజిరెడ్డి గోవర్దన్ కు కోలుకోలేని షాక్ ఇచ్చారు. ఇక అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతు బంధు సంస్థ చైర్మన్ గా స్టేషన్ ఘన్ పూర్ శాసనసభ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న తాటికొండ రాజయ్య(Thatikonda Rajaiah) ను నియమించారు.
రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంస్థ చైర్మన్ గా నందికంటి శ్రీధర్ కు ఛాన్స్ ఇచ్చారు బీఆర్ఎస్ బాస్ కేసీఆర్. కాగా ఇద్దరు ఎమ్మెల్యేలపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. స్వంత కూతురే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై భూ కబ్జా ఆరోపణలు చేశారు.
ఇక తాజాగా సీఎం ప్రకటించిన ఎమ్మెల్యేల లిస్టులో తాటికొండ రాజయ్యకు మొండి చేయి చూపించారు.
Also Read : CM Break Fast Scheme : రేపే సీఎం అల్పాహారం స్కీం స్టార్ట్