Thatikonda Rajaiah : టికెట్ రాకున్నా బీఫామ్ నాకే

ఎమ్మెల్యే రాజయ్య కామెంట్

Thatikonda Rajaiah : బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తాడికొండ రాజ‌య్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సీఎం ప్ర‌క‌టించిన ఎమ్మెల్యేల జాబితాలో త‌న పేరు లేక పోయినా త‌న‌కు బిఫామ్ వ‌స్తుంద‌న్న న‌మ్మ‌కం త‌న‌కు ఉంద‌న్నారు. ఇప్ప‌టికీ త‌న‌కు సీఎం కేసీఆర్ పై పూర్తి న‌మ్మ‌కం ఉంద‌ని చెప్పారు తాడికొండ రాజయ్య‌.

Thatikonda Rajaiah Shocking Comments

స్టేష‌న్ ఘ‌న్ పూర్ నియోజ‌క‌వ‌ర్గంలో అత్య‌ధికంగా మాదిగ‌లు ఎక్కువ‌గా ఉన్నార‌ని, కాబిట్టి టికెట్ త‌ప్ప‌నిస‌రిగా నాకే వ‌స్తుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. ఇదిలా ఉండ‌గా బీఆర్ఎస్ బాస్ , సీఎం కేసీఆర్ ఇటీవ‌ల లిస్టు ప్ర‌క‌టించారు.

119 సీట్ల‌కు గాను 115 సీట్ల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించారు. మొత్తం 7 నియోజ‌క‌వ‌ర్గాల‌లో సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు మండి చేయి చూపించారు కేసీఆర్. ఇందులో సీట్లు కోల్పోయిన వారిలో తాజాగా స్టేష‌న్ ఘ‌ణపూర్ ఎమ్మెల్యే తాడికొండ రాజ‌య్య(Thatikonda Rajaiah ) కూడా ఉన్నారు.

ఆయ‌న చివ‌రి దాకా త‌న‌కు టికెట్ వ‌స్తుంద‌ని అనుకున్నారు. ఉన్న‌ట్టుండి ఆయ‌న‌కు కోలుకోలేని షాక్ ఇచ్చారు కేసీఆర్. టికెట్ నిరాక‌రించారు. దీంతో రాజ‌య్య బావురుమ‌న్నారు. చ‌ర్చి వ‌ద్ద‌కు వెళ్లారు. గుడికి వెళ్లి క‌న్నీటి ప‌ర్యంతం అయ్యారు . రాజ‌య్య‌కు కాకుండా మాజీ డిప్యూటీ సీఎం క‌డియం శ్రీ‌హ‌రికి టికెట్ కేటాయించారు కేసీఆర్.

Also Read : KA Paul : ప‌వ‌న్ పార్టీని విలీనం చేయాలి

Leave A Reply

Your Email Id will not be published!