Appalayagunta : అప్పలాయగుంట బ్రహ్మోత్సవాలు
మే 31 నుండి జూన్ 8వ తేదీ దాకా
Appalayagunta : భక్తుల కొంగు బంగారంగా వినుతికెక్కిన శ్రీ అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈ నెలలోనే ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. మే 31 నుండి జూన్ 8వ తేదీ వరకు శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఉత్సవాలు జరగనున్నాయి. అంతకు ముందు మే 23న మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం , మే 30న సాయంత్రం అంకురార్పణ నిర్వహిస్తారు. మే 31న ధ్వజారోహణం, పెద్ద శేష వాహనం ఉంటుంది.
జూన్ 1న చిన్న శేష వాహనం , హంస వాహనంపై స్వామి వారు దర్శనం ఇస్తారు. 2న సింహ వాహనం, ముత్య పందిరి వాహనం , 3న కల్పవృక్ష వాహనం ,కళ్యాణోత్సవం, సర్వ భూపాల వాహనంపై దర్శనం ఇస్తారు శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి. 4న మోహినీ అవతారం, గరుడ వాహనం , 5న హనుమంత వాహనం, గజ వాహనం ఉంటుందని ఈవో ధర్మా రెడ్డి వెల్లడించారు. 6న సూర్య ప్రభ వాహనం, చంద్ర ప్రభ వాహనం , 7న అశ్వ వాహనం, 8న చక్ర స్నానం , ధ్వజావరోహణం ఉంటుందని తెలిపారు.
బ్రహ్మోత్సవాలలో ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు , రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు వాహన సేవలు జరగనున్నాయి. జూన్ 3వ తేదీ సాయంత్రం 4.30 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు స్వామి వారి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నట్లు ఈవో స్పష్టం చేశారు.
Also Read : Harbhajan Singh