Devendra Fadnavis : శివసేన పతనం ప్రారంభం – ఫడ్నవిస్
భారతీయ జనతా పార్టీ చీఫ్ , మాజీ సీఎం
Devendra Fadnavis : మహారాష్ట్రలో అధికార మహా వికాస్ అఘాడీ (ఎంవిఏ) సంకీర్ణ సర్కార్ కు కోలుకోలేని షాక్ తగిలింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాజ్యసభ ఎన్నికల్లో 6వ ఎంపీ సీటును కైవసం చేసుకుంది భారతీయ జనతా పార్టీ.
ఇది ఉద్దవ్ ఠాక్రేకు పెద్ద దెబ్బ. ఇరు పార్టీలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డాయని ఆరోపణలు చేశాయి ఈసీకి. కానీ అంతిమంగా ఫలితాలు చూస్తే అధికార పార్టీకి 3 సీట్లు , బీజేపీకి 3 సీట్లు దక్కాయి.
విచిత్రం ఏమిటంటే బీజేపీ, శివసేన మధ్య జరిగిన ఉత్కంఠ భరిత పోరులో చివరకు శివసేన పార్టీ అభ్యర్థి సంజయ్ పవార్ ఓడి పోవడం ఆ పార్టీ చీఫ్, సీఎం ఉద్దవ్ ఠాక్రేకు కోలుకోలేని దెబ్బ.
తన అభ్యర్థిని గెలిపించు కోలేక పోవడం ఒక రకంగా ఇబ్బందికరమే. ఈ తరుణంలో ఎన్నికల్లో విజయం అనంతరం భారతీయ జనతా పార్టీ చీఫ్, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్(Devendra Fadnavis) మీడియాతో మాట్లాడారు.
ఈ ఫలితాలు ఆరంభం మాత్రమేనని మున్ముందు కాషాయ జెండా రెప రెప లాడడం ఖాయమన్నారు. సంకీర్ణ ప్రభుత్వం పతనం ప్రారంభమైందన్న విషయం ఈ గెలుపుతో తేలిందన్నారు ఫడ్నవిస్.
అధికార పార్టీ ఎలాగైనా సరే గెలవాలని ప్రయత్నాలు చేసింది. కానీ అభ్యర్థులు మాత్రం తమకే ఓటు వేసి గెలిపించారని వారికి తాము ధన్యవాదాలు తెలియ చేస్తున్నామని చెప్పారు బీజేపీ చీఫ్.
ఇదిలా ఉండగా అర్ధరాత్రి వరకు ఉత్కంఠ భరిత వాతావరణం నెలకొంది. ఎవరు గెలుస్తారనే టెన్షన్ ను తెర దించుతూ బీజేపీ గెలుపు జెండా ఎగుర వేసింది.
Also Read : ఠాక్రే కూటమికి కోలుకోలేని దెబ్బ