RuPay Card : రూపే కార్డుతో లాభాలు ఎన్నెన్నో
71 కోట్ల రూపే కార్డులు జారీ
RuPay Card : కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపే కార్డు అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ కార్డును కలిగి ఉండడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి.
నిర్దిష్టమైన వర్గాల ప్రజలకు బ్యాంకింగ్ సౌకర్యాలను అందించేందుకు గాను వివిధ ప్రభుత్వ పథకాల కింద రూపే డెబిట్ కార్డులు జారీ చేస్తున్నాయి బ్యాంకులు.
ఎన్నో ఉపయోగాలు ఉండడంతో పెద్ద ఎత్తున రూపే కార్డు(RuPay Card) తీసుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) దేశీయ, ఓపెన్ లూప్ , బహుపాక్షిక వ్యవస్థను అందించేందుకు రూపే కార్డు చెల్లింపు వ్యవస్థను ప్రారంభించింది.
ఇది భారత దేశంలోని అన్ని భారతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థలను ఎలక్ట్రానిక్ చెల్లింపులు జారీ చేసేందుకు వీలు కలుగుతుంది.
రూపే కార్డు జారీని ప్రోత్సహించేందుకు ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (పీఎంజేడీవై) కింద ఖాతాదారులకు ఉచిత రూపే డెబిట్ కార్డు అందజేస్తోంది.
ఇందులో ప్రమాద బీమా కవర్ గతంలో లక్ష రూపాయలు ఉండేది. దానిని మరో లక్ష అదనంగా చేర్చింది కేంద్రం. ఆగస్టు 28, 2018 తర్వాత తెరిచిన ఖాతాల కోసమే ఇది తగిలింది.
కేంద్ర ప్రభుత్వం రూపే కిసాన్ క్రెడిట్ కార్డు, ముద్ర కార్డ్ , గ్రెయిన్ కార్డులను జారీ చేస్తోంది. సకాలంలో సాగు కోసం క్రెడిట్ , వర్కింగ్ క్యాపిటల్ కోసం క్రెడిట్ , హార్వెస్ట్ ధాన్యం సేకరణ కోసం వంటి నిర్దిష్ట అవసరాలను తీర్చేందుకు వీలవుతుంది.
ఇదిలా ఉండగా రూపే కార్డుల(RuPay Card) ను క్లాసిక్ , ప్లాటినం, సెలెక్ట్ వేరియంట్ లు వివిధ సెగ్మెంట్ కస్టమర్ల కోసం రూపొందించారు. అంతర్జాతీయ నెట్ వర్క్ భాగస్వామ్యులతో కూడా టై అప్ చేస్తోంది రూపే కార్డు. 71 కోట్ల రూపే కార్డులు జారీ చేసింది కేంద్రం.
Also Read : జూలై 26న 5జీ స్పెక్ట్రమ్ వేలం