Arvind Kejriwal : ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన కామెంట్స్ చేశారు. పంజాబ్ లో అఖండ విజయం తర్వాత కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ, ప్రధాని మోదీ ఆప్ ను చూసి భయపడుతున్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీలో నగర ఎన్నికలను వాయిదా వేయాలని తీసుకున్న నిర్ణయంపై స్పందించారు. ఎన్నికలు ప్రజాస్వామ్యానికి పట్టు కొమ్మలని , వాటినా అడ్డుకోవడం అంటే డెమోక్రసీని పాతర పెట్టడమేనని ఆరోపించారు కేజ్రీవాల్(Arvind Kejriwal).
ప్రత్యేకించి దేశ రాజధాని ఢిల్లీలో పౌర ఎన్నికలు వాయిదా వేయకుండా చూడాలని ప్రధాని మోదీని కోరారు. వీటిని వాయిదా వేయడం వల్ల ప్రజాస్వామ్యాన్ని మరింత బలహీన పరుస్తుందన్నారు.
మూడు పౌర సంఘాలను ఏకీకృతం చేసేందుకు ఈసారి బడ్జెట్ సెషన్ లో బిల్లును తీసుకు రావాలని కేంద్రం యోచిస్తోందంటూ అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) ఆరోపించారు.
లెఫ్టినెంట్ గవర్నర్ బైజాల్ పోల్ ప్యానల్ ను పరిశీలిస్తుండడంతో ఎన్నికల షెడ్యూల్ ప్రకటనను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఢిల్లీ రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.
దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపారు సీఎం అరవింద్ కేజ్రీవాల్. మే 18వ తేదీ గడువు లోపు ఎన్నికలు నిర్వహించేందుకు తగిన సమయం ఉందని పేర్కొన్నారు.
దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ , ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ , తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లు అన్నీ బీజేపీ నియంత్రణలో ఉన్నాయి. ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
గత ఎనిమిదేళ్లుగా ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదని అని పేర్కొన్నారు కేజ్రీవాల్. ప్రస్తుతం తమ ఆప్ వేవ్ నడుస్తోందని అందుకే బీజేపీ భయపడుతోందంటూ ఎద్దేవా చేశారు.
Also Read : భగవంత్ మాన్ కు భజ్జీ కితాబు