Jairam Ramesh : రాజీవ్ హంతకుల విడుదల దారుణం – జైరాం
సుప్రీంకోర్టు తీర్పు ఆమోద యోగ్యం కాదు
Jairam Ramesh : దివంగత మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ దారుణ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న నళిని శ్రీహరన్ తో పాటు ఆరుగురిని విడుదల చేయాలని సుప్రీంకోర్టు శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఈ కేసుకు సంబంధించి నిందితులను ఎలా విడుదల చేస్తారంటూ ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మీడియా ఇన్ చార్జ్ జైరాం రమేష్. ఇది పూర్తిగా అసంబద్దంగా ఉందని పేర్కొన్నారు. శుక్రవారం జైరాం రమేష్(Jairam Ramesh) మీడియాతో మాట్లాడారు.
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హంతకుల విడుదల విషయంలో కోర్టు అనుసరించిన పద్దతి, విడుదల చేసిన తీరు సమంజసంగా లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా ఆమోద యోగ్యం కాదని స్పష్టం చేశారు. పూర్తిగా తప్పు అంటూ కుండ బద్దలు కొట్టారు. దీనిని తమ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుందన్నారు జైరాం రమేష్.
భారత దేశ స్పూర్తికి అనుగుణంగా భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం వ్యవహరించక పోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ మేరకు ఆయన పార్టీ తరపున కీలక ప్రకటన చేశారు. అధికారికంగా ట్విట్టర్ లో విడుదల చేయడం గమనార్హం. ఇదిలా ఉండగా ఇప్పటికే రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు పడిన పెరారివాలన్ ను ఇటీవలే సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. తాజాగా నళిని శ్రీహరన్ తో పాటు ఆరుగురిని విడుదల చేయడాన్ని తప్పు పట్టింది.
Also Read : నళినితో సహా ఆరుగురు విడుదల – సుప్రీం