Lakhimpur Dalit Sisters : దళిత సోదరీమణుల కేసు కలకలం
ఇప్పటి వరకు ఆరుగురు అదుపులో
Lakhimpur Dalit Sisters : మరోసారి ఉత్తర ప్రదేశ్ చర్చనీయాంశంగా మారింది. రైతులను చంపిన ఘటనలో లఖింపూరి(Lakhimpur Dalit Sisters) ఖేరి వెలుగులోకి వచ్చింది. తాజాగా ఇదే ప్రాంతం మరోసారి వార్తల్లో నిలిచింది.
దళిత కులానికి చెందిన సోదరీమణలు అత్యాచారం, ఆపై హత్యకు గురి కావడం కలకలం రేపింది. ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఏరియా పోలీస్ చీఫ్ చెప్పారు.
రేప్ , మర్డర్ కు గురైనట్లు భావిస్తున్న ఇద్దరు దళిత అక్కా చెల్లెళ్లలో(Lakhimpur Dalit Sisters) ఒకరికి 15 ఏళ్లు, మరొకరికి 17 ఏళ్లు ఉన్నాయి. ఇద్దరూ మైనర్లే కావడం గమనార్హం. అత్యాచారం, హత్య తర్వాత బుధవారం మృతదేహాలు బయట పడ్డాయి.
ఈ కేసుకు సంబంధించి ఆరుగురిని అరెస్ట్ చేశామని చెప్పారు పోలీస్ బాస్. ప్రమేయం ఉన్న వారందరినీ అదుపులోకి తీసుకున్నామని స్పష్టం చేశారు.
అరెస్ట్ అయిన వారిలో బాధితుల పరిసర ప్రాంతానికి చెందిన ఒకరు కూడా ఉన్నారని చెప్పారు. అతను అమ్మాయిలను మరో ముగ్గురికి పరిచయం చేశాడు.
కానీ నేరం జరిగిన ప్రదేశంలో మాత్రం లేడన్నారు పోలీస్ సూపరింటెండెంట్ సంజీవ్ సుమన్ చెప్పారు. పోలీసులతో జరిగిన ఎన్ కౌంటర్ లో ఈ ఉదయం ఒక వ్యక్తి పట్టుబడ్డాడని , కాలుపై కాల్చాడని తెలిపారు.
అతడిని కూడా గుర్తించినట్లు తెలిపారు. మొత్తం ఆరుగురిపై లైంగిక నేరాలకు వ్యతిరేకంగా పిల్లల రక్షణ (పోక్సో) చట్టంతో పాటు హత్య, అత్యాచారం కింద కేసు నమోదు చేశామన్నారు ఎస్పీ.
Also Read : హిజాబ్ కేసులో సుప్రీం కీలక కామెంట్స్