Statue Of Equality : జగత్ గురు శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలోని శ్రీరామనగరం ఆశ్రమ ప్రాంగణంలో (Statue Of Equality )ఏర్పాటు చేసిన సమతామూర్తి సమతా కేంద్రం ఇక నుంచి ఆధ్యాత్మిక క్షేత్రంగా భాసిల్లనుంది.
దేశ నలుమూలల నుంచి శ్రీ భగవద్ రామానుజుడి ఉత్సవ మూర్తిని చూసేందుకు, దర్శించుకునేందుకు తరలి వస్తున్నారు భక్త బాంధవులు. పదేళ్ల కిందట ఆ మహనీయుడి విగ్రహ ఏర్పాటుకు అంకురార్పణ జరిగింది.
ఆనాటి నుంచి కల ఇప్పుడు ఆచారణాత్మక రూపంలో ఆవిష్కృతమైంది. రూ 1000 కోట్ల ఖర్చు. 2 వేల మందికి పైగా నిపుణులు ఈ విగ్రహ నిర్మాణంలో పాలు పంచుకున్నారు. చైనాలో దీనిని నిర్మించారు.
సమతామూర్తితో పాటు 108 దివ్య మూర్తుల విగ్రహాలు కూడా ఇక్కడ కొలువుతీరాయి. రవాణా పరంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. విమానాశ్రయం, జాతీయ రహదారి, ట్రైన్ సౌకర్యం కూడా ఉంది.
దీంతో ఈ ప్రాంతం ఇప్పుడు దేదీప్య మానంగా వెలుగొందుతోంది. ఈ సమతాకేంద్రంలో వచ్చే వారికి ఎలాంటి లోటు అంటూ ఉండదు. అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. పదమూడు రోజుల పాటు ఉత్సవాలు జరిగాయి.
స్వామి వారి స్వర్ణ మూర్తి కూడా ప్రారంభమైంది. వేలాది మంది రుత్వికులు, ఆచార్యులు, పండితులు, యోగులు, స్వాములు, పీఠాధిపతులు హాజరయ్యారు. ప్రతి రోజూ అష్టాక్షరీ మంత్ర పఠనం, విష్ణు సహస్ర పారాయణం చేశారు.
1035 హోమ కుండాల్లో 5 వేల మంది రుత్వికులు పాల్గొన్నారు. లక్ష్మీ నారాయణ మహా యజ్ఞం చేపట్టారు. చివరి రోజు యాగానికి చిన్న జీయర్ స్వామి పర్యవేక్షణలో మహా పూర్ణాహుతి పలికారు.
Also Read : ముగిసిన సంబురం భక్తుల ఆనందం