Uddhav Thackeray EC : ఎన్నికల సంఘాన్ని రద్దు చేయాలి – ఠాక్రే
శివసేన పార్టీ గుర్తు కేటాయింపుపై ఫైర్
Uddhav Thackeray EC : శివసేన పార్టీకి సంబంధించిన విల్లు ..బాణం గుర్తును తిరుగుబాటు చేసిన సీఎం ఏక్ నాథ్ షిండే కు కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించింది. దీనిపై సీరియస్ గా స్పందించారు మాజీ చీఫ్ ఉద్దవ్ ఠాక్రే. ఈ సందర్భంగా సంచలన కామెంట్స్ చేశారు. భారత కేంద్ర ఎన్నికల సంఘాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు మాజీ సీఎం(Uddhav Thackeray EC).
ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తోందని, అంతలోనే ఏం ముప్పు నెలకొందని ఇంత త్వరగా ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుందని ప్రశ్నించారు మాజీ సీఎం. ప్రజాస్వామ్య సంస్థల సాయంతో భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తోందని ఆరోపించారు ఉద్దవ్ ఠాక్రే.
తన తండ్రి బాల్ ఠాక్రే స్థాపించిన శివసేన పార్టీ పేరును, గుర్తును కోల్పోయిన రెండు రోజుల తర్వాత ఎన్నికల కమిషన్ ను రద్దు చేయాలని కోరారు. అంతే కాదు కేంద్ర సర్కార్ నియమించకుండా ప్రజలు నేరుగా కేంద్ర ఎన్నికల కమిషనర్లను ఎన్నుకునే విధానాన్ని ప్రవేశ పెట్టాలంటూ డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా పార్టీ పేరు, చిహ్నం నేరుగా ఒక వర్గానికి ఇచ్చిన సందర్బం భారత దేశ చరిత్రలో ఎక్కడా లేదన్నారు ఉద్దవ్ ఠాక్రే.
సోమవారం ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసిన కొన్ని గంటల తర్వాత ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలాగే కొనసాగితే 2024 తర్వాత దేశంలో డెమోక్రసీ అన్నది ఉండదన్నారు. నేను హిందుత్వను ఎప్పటికీ విడిచి పెట్టలేదు. హిందువు ఎవరో ఇప్పుడు మాట్లాడాలని అన్నారు మాజీ సీఎం.
Also Read : అసెంబ్లీ ఎదుట అఖిలేష్ ధర్నా