Bajarang Punia : కాల్చి చంపినా పోరాటం ఆపం

భార‌త రెజ్ల‌ర్ బ‌జ‌రంగ్ పునియా

Bajarang Punia : ఈ దేశంలో ఇంకా న్యాయం బ‌తికే ఉంద‌ని న‌మ్ముతున్నాం. మేం దేశానికి వ్య‌తిరేకం కాదని ప‌లుమార్లు స్ప‌ష్టం చేశాం. న్యాయం కోసం గ‌త కొంత కాలంగా పోరాడుతున్నాం. తాము చేస్తున్న న్యాయ పోరాటానికి అన్ని వ‌ర్గాల నుంచి మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. దీనిని మేం కాద‌న‌డం లేదు. మేం ముంద‌స్తుగా నిర్ణ‌యించిన ప్ర‌కార‌మే మ‌హిళా పంచాయ‌త్ చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించాం. ఆ విష‌యాన్ని ఢిల్లీ పోలీసుల‌కు ముందే తెలియ చేశామ‌న్నారు భార‌త రెజ్ల‌ర్ బ‌జ‌రంగ్ పునియా(Bajarang Punia).

గ‌త ఏప్రిల్ 23 నుంచి మ‌హిళా రెజ్ల‌ర్లు జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద నిర‌స‌న దీక్ష చేప‌ట్టారు. భార‌త రెజ్ల‌ర్ స‌మాఖ్య చీఫ్‌, యూపీకి చెందిన ఎంపీ బ్రిజ్ భూష‌ణ్ శ‌ర‌ణ్ సింగ్ లైంగిక‌, శారీర‌క వేధింపుల‌కు పాల్ప‌డుతున్నాడంటూ ఆయ‌న‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ ఆందోళ‌న బాట ప‌ట్టారు. ఆదివారం నూత‌న పార్ల‌మెంట్ దాకా శాంతియుత మార్చ్ కు పిలుపునిచ్చారు. భారీ ఎత్తున చేరుకున్న వారిపై ఢిల్లీ పోలీసులు దాష్టీకాన్ని ప్ర‌ద‌ర్శించారు.

అవ‌స‌ర‌మైతే చంపబ‌డ‌తారంటూ ఓ మాజీ పోలీస్ అధికారి చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపాయి. దీనిపై భార‌త రెజ్ల‌ర్ బ‌జ‌రంగ్ పునియా ఘాటుగా స‌మాధానం ఇచ్చారు. కాల్పుల‌కు తెగ‌బ‌డినా ఎదుర్కొనేందుకు తాము సిద్దంగా ఉన్నామ‌ని స్ప‌ష్టం చేశారు. తాము లై డిటెక్ట‌ర్ నార్కో టెస్టుకు సిద్దంగా ఉన్నామ‌ని ప్ర‌క‌టించారు. ఇదిలా ఉండ‌గా తామే దాడికి పాల్ప‌డి చివ‌ర‌కు బాధితుల పైనే కేసులు న‌మోదు చేశారు ఢిల్లీ ఖాకీలు.

Also Read : PM Modi Flags

 

Leave A Reply

Your Email Id will not be published!