Emmanuel Macron : మెజారిటీని కోల్పోయిన ఫ్రెంచ్ చీఫ్ మాక్రాన్
ఫ్రాన్స్ దేశం రాజకీయం గందరగోళం
Emmanuel Macron : ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్(Emmanuel Macron) గెలిచారు. కానీ ఊహించని రీతిలో ఆయనకు ఎదురు దెబ్బ తగిలింది. పార్లమెంట్ లో మాక్రాన్ మెజారిటీని కోల్పోయారు.
దీంతో ఫ్రాన్స్ దేశంలో రాజకీయ అనిశ్చితి వాతావరణం నెలకొంది. పూర్తిగా రాజకీయాలను గందరగోళంలోకి నెట్టివేసింది. దిగ్భాంతికరమైన ఎదురు దెబ్బకు షాక్ కు గురయ్యారు ఫ్రెంచ్ అధ్యక్షుడు.
ఇది ఊహించని పరిణామం. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో సంకీర్ణాల అవకాశాలను పెంచింది. ఈ ఫలితం గత ఏప్రిల్ నెలలో జరిగిన అధ్యక్ష ఎన్నికల విజయాన్ని తీవ్రంగా దెబ్బతీసింది.
మాక్రాన్ ఆదివారం తన పార్లమెంటరీ మెజారిటీని కోల్పోవడం విస్తు పోయేలా చేసింది. కొత్తగా ఏర్పడిన వామపక్ష కూటమి వల్లే ఇదంతా జరిగిందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
మాక్రాన్ కూటమి జాతీయ అసెంబ్లీలో అతి పెద్ద పార్టీగా అవతరిస్తుంది. కాగా అది 200 నుంచి 260 సీట్లకే పరిమితం కానుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా లేదా తాను ఫ్రెంచ్ ప్రెసిడెంట్ గా ఉండాలంటే కనీసం 289 సీట్లు కావాల్సి ఉంటుంది.
ఇంకా 29 సీట్లు కావాల్సి వస్తుంది. ఇది పూర్తిగా నిరాశ పరిచిందని ప్రభుత్వ ప్రతినిధి ఒలివియా గ్రెగోయిర్ మీడియాతో పేర్కొన్నారు. రెండు దశాబ్దాలలో రెండవ సారి విజయం సాధించిన ఫ్రెంచ్ అధ్యక్షుడిగా మాక్రాన్(Emmanuel Macron) చరిత్ర సృష్టించారు.
కానీ పార్లమెంట్ లో మెజారిటీ కోల్పోవడం ఒక రకంగా కోలుకోలేని దెబ్బేనని చెప్పక తప్పదు. ప్రస్తుత అంచనాల ప్రకారం 70 ఏళ్ల హార్డ్ లెఫ్ట్ ఫిగర్ హెడ్ జీన్ లూక్ మెలెన్ చోన్ సారథ్యంలోని కొత్త వామపక్ష కూటమి 149 నుంచి 200 సీట్లు గెలుచుకునే దశలో ఉంది.
Also Read : 15 ఏళ్లు పాలించాలని ఇమ్రాన్ ఖాన్ కుట్ర