DK Shiva Kumar : దేశంలోని ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. కాంగ్రెస్ పార్టీ ఐదు రాష్ట్రాలలోను సత్తా చాటలేక పోయింది. విచిత్రంగా నాలుగింట్లో బీజేపీ హవా కొనసాగించింది.
కానీ ఉన్న ఒక్క పంజాబ్ రాష్ట్రంలో పవర్ ను కోల్పోవడం ఆ పార్టీని కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఈ తరుణంలో పలువురు సీనియర్లు కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించేందుకు రెడీ అవుతున్నారు.
ఫలితాలు అనంతరం కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్(DK Shiva Kumar) సంచలన కామెంట్స్ చేశారు. గాంధీ ఫ్యామిలీ (కుటుంబం ) లేకుండా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ బతకదన్నారు. పార్టీ కోసమే కాదు దేశం కోసం ఆ కుటుంబం త్యాగం చేసిన విషయం మరిచి పోకూడదన్నారు.
ఇందిరా గాంధీని పొట్టన పెట్టుకున్నారు. రాజీవ్ గాంధీని చంపేశారు. ఈ తరుణంలో వాళ్లు నేటికీ దేశం కోసం నిలబడ్డారు. పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తూ వచ్చారన్నారు డీకేఎస్.
అంతే కాదు గాంధీ కుటుంబం లేకుండా కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా ఉండదన్నారు. ఆయన సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీల నాయకత్వాన్ని బలపరుస్తూ మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ ఐక్యతకు వారే కారణమని కితాబు ఇచ్చారు. రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీ శక్తి వంచన లేకుండా ఈ ఎన్నికలలో పర్యటించారు. వారు శాయ శక్తులా కృషి చేశారు.
వారితో పాటు తాము కూడా పని చేశామన్నారు డీకేఎస్. కానీ ప్రజలు తమ పార్టీని నమ్మలేదన్నారు. ఓటర్లను మెస్మరైజ్ చేయడంలో బీజేపీ సక్సెస్ అయ్యిందని మండిపడ్డారు.
ఈ ఎన్నికల ప్రభావం వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఉండదన్నారు.
Also Read : కాంగ్రెస్ పార్టీపై కెప్టెన్ కన్నెర్ర