Modi : వెయ్యేళ్ల కిందట ఈ భూమి మీద జన్మించిన శ్రీ రామానుజాచార్యులు సమానతను చాటారని కొనియాడారు. సమతామూర్తి నిత్యం ప్రాతః స్మరణీయుడు అని స్పష్టం చేశారు.
హైదరాబాద్ లోని ముచ్చింతల్ శ్రీరామనగరం సమతా కేంద్రంలో ఏర్పాటు చేసిన 216 అడుగుల భారీ సమతామూర్తి విగ్రహాన్ని ప్రధాని మోదీ(Modi) ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మోదీ ప్రసంగించారు. ఇవాళ వసంత పంచమి శుభదినం రోజు కావడం తనకు సంతోషం కలిగించిందన్నారు. ఈ సందర్భంగా దేశంలోని ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలిపారు.
సమస్త మానవకోటి అంతా సమానమేనని చాటి చెప్పిన ఆ మహనీయుడి విగ్రహాన్ని ఈ జాతికి అంకితం చేస్తున్నానని సభాసాక్షిగా ప్రకటించారు నరేంద్ర మోదీ(Modi).
దళితులకు కూడా ఆలయ ప్రవేశం ఉండాలని ఆనాడే పోరాడాడని కొనియాడారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అనే నినాదంతో తాము ముందుకు వెళుతున్నామని చెప్పారు.
దేశంలోని ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు కల్పించాలనే తాను ప్రయత్నం చేస్తున్నానని అన్నారు. సమాజంలో అంతరాలు ఉండ కూడదని రామానుజుడు ఆశించాడని ఇదే దానిని ఆచారణాత్మకంగా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ కూడా ప్రయత్నం చేశాడని ప్రశంసించారు.
భారత రాజ్యాంగాన్ని తయారు చేశాడన్నారు. పేదలు, దళిత, మధ్య తరగతి, అన్ని వర్గాల వారికి న్యాయం చేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.
రామానుజుడు చూపిన మార్గాన్ని మనం అనుసరించాలని పిలుపునిచ్చారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Modi). ఈ లోకంలో వచ్చిన ప్రతి ఒక్కరూ సమానమేనని అన్నారు.
రామానుజుడి గురు మంత్రం గొప్పదన్నారు. గురువు ద్వారానే జ్ఞానం లభిస్తుందన్నారు. ఆ మార్గాన్ని చూపిన మహనీయుడని ప్రశంసించారు.
రామానుజుడు దక్షిణాదిలో జన్మించినా ఆయన దేశమంతటా విస్తరించాడని కొనియాడారు. భారత దేశం ఏకత్వంగా ఉండాలనే ఆధ్యాత్మిక భావ జలధార కొనసాగుతూనే ఉందన్నారు.
ఆజాద్ కీ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రాణాలు అర్పించిన వారిని, ఆధ్యాత్మికవేత్తలు, రుషులను స్మరించుకుంటున్నామని తెలిపారు.
Also Read : ఆధ్యాత్మిక సిగలో సమతా మూర్తి