Arindam Bagchi : ఇరాన్ మంత్రి కామెంట్స్ అర్థరహితం
ఖండించిన కేంద్ర ప్రభుత్వం
Arindam Bagchi : ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. భారత, ఇరాన్ దేశాల మధ్య జరిగిన సమావేశంలో మహ్మద్ ప్రవక్తపై బీజేపీ నాయకులు చేసిన కామెంట్స్ ప్రస్తావనకు వచ్చిందని, దీనిపై భారత దేశ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ క్లారిటీ ఇచ్చారంటూ సదరు మంత్రి ట్వీట్ చేశారు.
దీని గురించి పెద్ద ఎత్తున ఆ దేశ మీడియా కూడా ప్రచారం చేసింది. దీనిపై తీవ్రంగా స్పందించింది భారత దేశ ప్రభత్వం.
మహ్మద్ ప్రవక్తకు సంబంధించిన వ్యాఖ్యల గురించి సదరు సమావేశంలో ఎలాంటి చర్చకు రాలేదని స్పష్టం చేశారు భారత దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి(Arindam Bagchi).
ఇదంతా అబద్దమని, అర్థరహితమని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ మంత్రి లేవనెత్తిన ప్రవక్త వ్యాఖ్యలను సందర్శించడాన్ని కేంద్రం ఖండిస్తోందని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఇరానియన్ రీడౌట్ తీసి వేశామన్నారు. ప్రవక్త వ్యాఖ్యలను ఖండిస్తూ కువైట్ , ఖతార్ , ఇతర గల్ఫ్ దేశాలతో కలిసి ఇరాన్ నుండి వచ్చిన విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ అబ్దుల్లాహియాన్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో జరిగిన మీటింగ్ లో వివాదాస్పద వ్యాఖ్యలను లేవనెత్తారంటూ ఇరాన్ ప్రకటన చేసింది.
దీనిని పూర్తిగా కేంద్రం ఖండించిందని బాగ్చి స్పష్టం చేశారు మరోసారి. ఇదిలా ఉండగా భారత దేశం ఇప్పటికే పూర్తిగా క్లారిటీ ఇచ్చింది.
ఈ దేశంలో మైనార్టీలే కాదు అన్ని వర్గాలు, మతాల వారి పట్ల సమానంగా చూస్తుందని తెలిపింది. వ్యక్తిగతంగా చేసిన కామెంట్స్ ను ప్రభుత్వానికి ఆపాదించ వద్దని స్పష్టం చేసింది కేంద్రం.
Also Read : ఆ నేతల్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు