The Kashmir Files : వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో వచ్చిన ది కశ్మీర్ ఫైల్స్ మూవీ(The Kashmir Files )కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ సినిమా కమర్షియల్ సినిమాలను దాటుకుని దుమ్ము రేపుతోంది. ఎలాంటి ప్రచార ఆర్భాటాలు లేకుండానే సైలంట్ గా దేశ వ్యాప్తంగా విడుదలైంది.
దేశంలోని పలు రాష్ట్రాలు ఈ చిత్రానికి సంబంధించి వినోద పన్ను మినహాయింపు ఇచ్చాయి. 1990లో జమ్మూ కశ్మీర్ లో కాశ్మీరీ పండిట్లు ఎదుర్కొన్న దారుణాలు, పాకిస్తాన్ ఉగ్రవాదులు సాగించిన మారణకాండను కళ్లకు కట్టినట్లు ఫిల్మ్ మేకర్ వివేక్ చూపించారు.
ఇప్పటి దాకా ఊహించని రీతిలో రూ. 60 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీంతో సినీ వర్గాలను సైతం విస్తు పోయేలా చేసింది. ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేవు. ఇందులో కామెడీ లేదు కన్నీళ్లు తప్ప. ఎలాంటి సాంగ్స్ లేవు, జిమ్మిక్కులు లేవు.
కానీ కంట తడి పెట్టించే దృశ్యాలు ఉన్నాయి. యధార్థ దారుణాలకు దృశ్య రూపం ఇచ్చే ప్రయత్నం చేశారు వివేక్ అగ్ని హోత్రి. ఇందులో నటించిన వారంతా జీవించారు.
ప్రధానంగా అనుపమ్ ఖేర్ నటన జనాన్ని కంట తడి పెట్టిస్తోంది ప్రత్యేకంగా. ది కశ్మీర్ ఫైల్స్(The Kashmir Files )మూవీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.
వాస్తవాలను, నిజాలను ధైర్యంగా చూపించిన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రిని అభినందించారు. ఇదిలా ఉండగా ఇవాళ ప్రముఖ ట్రేడ్ ఎక్స్ పర్ట్ తరణ్ ఆదర్శ్ సామాజిక వేదికగా రూ. 60 కోట్లు కొల్లగొట్టిందంటూ వెల్లడించాడు. ప్రస్తుతం ఈ మూవీ హాట్ టాపిక్ గా మారింది.
Also Read : జూన్లో పట్టాలెక్కనున్న భవదీయుడు భగత్ సింగ్