Manish Sisodia Modi : పీఎం త‌క్కువ అర్హ‌త‌లు దేశానికి ప్ర‌మాదం

మాజీ డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియా లేఖ

Manish Sisodia Modi : ఆమ్ ఆద్మీ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, ఢిల్లీ డిప్యూటీ సీఎం షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయ‌న దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీని టార్గెట్ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. సుదీర్ఘ లేఖ రాశారు.

ఇప్ప‌టికే పీఎం చ‌దువుకున్న విద్యార్హ‌త‌లు ఏమిటో చెప్పాలంటూ ఆప్ చీఫ్ , ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ దాఖ‌లు చేసిన పిటిషన్ ను కొట్టి పారేసింది గుజ‌రాత్ కోర్టు. ఇందుకు సంబంధించి స‌ర్టిఫికెట్లు స‌మ‌ర్పించాల్సిన అవ‌స‌రం లేద‌ని పేర్కొంది.

తాజాగా సిసోడియా(Manish Sisodia Modi) రాసిన లేఖ‌లో కీల‌క అంశాలు ప్ర‌స్తావించారు. ప్ర‌ధాన‌మంత్రికి సంబంధించి త‌క్కువ విద్యార్హ‌త‌లు క‌లిగి ఉండ‌డం అనేది దేశానికి ప్ర‌మాద‌క‌ర‌మ‌ని పేర్కొన్నారు. భార‌త దేశపు పురోగ‌మ‌నం సాధించాలంటే విద్యావంతులైన ప్ర‌ధాన‌మంత్రి అవ‌స‌ర‌మ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

న‌రేంద్ర మోదీకి విద్య ప్రాధాన్య‌త అర్థం కావ‌డం లేద‌ని ఆరోపించారు. ప్ర‌స్తుతం ఢిల్లీ లిక్క‌ర్ స్కాం కేసులో మ‌నీష్ సిసోడియా తీహార్ జైలులో ఉన్నాడు. అక్క‌డి నుంచే లేఖ రాశారు శుక్ర‌వారం. మోడీకి సైన్స్ అర్థం కాదు. చ‌దువు ప్రాముఖ్య‌త అర్థం చేసుకోక పోవ‌డం దారుణ‌మ‌న్నారు. గ‌త కొన్ని ఏళ్లుగా దేశంలో 60 వేల‌కు పైగా బ‌డులు మూత ప‌డ్డాయ‌ని ఆవేద‌న చెందారు.

పాల‌నా ప‌రంగా అవ‌గాహ‌న లేమితో ఇబ్బందుల‌కు గురి చేయ‌డం పీఎంకు అల‌వాటుగా మారింద‌న్నారు. ఇదే స‌మ‌యంలో అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేసిన ఘ‌న‌త మోదీకే ద‌క్కుతుంద‌న్నారు మ‌నీష్ సిసోడియా(Manish Sisodia).

Also Read : నాన్నంటే గౌర‌వం బీజేపీలో చేర‌డం వ్య‌క్తిగ‌తం

Leave A Reply

Your Email Id will not be published!