Sri Ramanujacharya : సమతామూర్తి జీవితం స్ఫూర్తి పాఠం
జీవన యానం ఆధ్యాత్మిక మార్గం
Sri Ramanujacharya : ఉన్నది ఒక్కటే జిందగీ. దీనిని ఆస్వాదించాలంటే, దీనిని పరిపూర్ణం చేసుకోవాలంటే ఒక్కటే మార్గం ఆధ్యాత్మికం. దీనికి సాధన కావాలి. అంతకంటే ఎక్కువగా సంయమనం అవసరం.
సన్మార్గంలో నడవాలంటే గురువు తప్పనిసరి ఉండాల్సిందే. లేక పోతే చదువు అబ్బదు. అక్షరం నేర్చుకోలేం. అలాగే దైవాన్ని చేరుకోవాలంటే అదే బాటలో ప్రయాణం చేస్తున్న వారిని ఆదర్శ ప్రాయంగా తీసుకోవాలి.
ఆ దిశగా అడుగులు వేస్తే కొంతలో కొంత మేర మనం అనుకున్న చోటుకు చేరుకునే అవకాశం ఉంటుంది. ఇదే వెయ్యేళ్ల కిందట చెప్పడమే కాదు ఆచరణలో చేసి చూపించాడు శ్రీ భగవద్ రామానుజాచార్యులు(Sri Ramanujacharya).
సమస్త మానవజాతి అంతా ఒక్కటేనని, జీవరాశులలో ఎలాంటి భేదం ఉండదని బోధించాడు. తిరుమంత్రంతో వినుతికెక్కారు. ఇవాళ కోట్లాది మంది కొలిచే దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్నది రామానుజుడి చలవేనని చెప్పక తప్పదు.
ఆనాటి స్ఫూర్తి అలాగే కొన్నేళ్లు గడిచినా నేటికీ ఆచరణాత్మకంగా ఉంది. స్పూర్తి దాయకంగా నిలుస్తోంది. ఆనాటి దివ్య జ్యోతిని మరింత వెలుగులు పంచేందుకని శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చినజీయర్ స్వామి ఏకంగా 216 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
దీనికి సమతామూర్తి స్పూర్తి కేంద్రం అని నామకరణం చేశారు. ఇప్పటికే శ్రీరామనగరం పేరుతో ఆశ్రమాన్ని 45 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. ఇక్కడ నిత్యం భక్తి కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయి.
ఈనెల 2న ప్రారంభమైన సమతామూర్తి మహోత్సవాలు ఈనెల 14 దాకా కొనసాగనున్నాయి. మానవుడే నా సందేశం అని చాటి చెప్పిన ఆ మహనీయుడిని స్మరించు కోవడం కాదు ఆచరించేందుకు ప్రయత్నం చేయాలి.
Also Read : అక్కడ బుద్దుడు ఇక్కడ రామానుజుడు