Rahul Gandhi : జాతీయ జెండా దేశానిది బీజేపీది కాదు
కాంగ్రెస్ మాజీ చీఫ్, ఎంపీ రాహుల్ గాంధీ
Rahul Gandhi : భారతీయ త్రివర్ణ పతాకం అన్నది 133 కోట్ల భారతీయులది. అది దేశానికి సంబంధించినది. కానీ భారతీయ జనతా పార్టీ, దాని అనుబంధ సంస్థలు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, విశ్వ హిందూ పరిషత్ , భజరంగ్ దళ్ కు చెందినది కాదని స్పష్టం చేశారు కాంగ్రస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ(Rahul Gandhi) .
తమిళనాడులోని కన్యాకుమారిలో బుధవారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన భారత్ జోడో యాత్రను రాహుల్ గాంధీ ప్రారంభించారు.
150 రోజుల పాటు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ఈ యాత్ర కొనసాగుతుంది. ఇది ఉదయం ప్రారంభమై సాయంత్రం ముగుస్తుంది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ప్రసంగించారు.
ఈ యాత్ర తనకు తపస్సు లాంటిదని చెప్పారు. ఈ మొత్తం యాత్ర 3,500 కిలోమీ టర్ల మేర కొనసాగుతుందన్నారు. ఆసక్తికర, కీలక వ్యాఖ్యలు చేశారు.
భారత దేశం ఈ జెండాను రక్షించే సంస్థలు, మీడియా , న్యాయ వ్యవస్థపై బీజేపీ, దాని సంస్థలు దాడి చేస్తున్నారు. వారు ఈ జెండా తమదని భావిస్తున్నారు.
వ్యక్తిగత ఆస్తులు, ప్రజల భవిష్యత్తును, ఈ దేశ స్థితిని తామే నిర్ణయించాలని అనుకుంటున్నారంటూ ధ్వజమెత్తారు రాహుల్ గాంధీ. ఎన్ని కేంద్ర దర్యాప్తు సంస్థలను మీరు ప్రయోగించినా ఏ ఒక్కరు, ఏ పార్టీ భయపడదన్నారు.
ద్రవ్యోల్బణం, నిరుద్యోగం సహా ఇతర ప్రధాన సమస్యలపై తాము పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఏఐసీసీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ లేఖ రాశారు. ఈ జోడో యాత్ర చేపట్టడం వల్ల దేశంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు.
Also Read : ఆ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు