Jagga Reddy : కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి(Jagga Reddy) సంచలన కామెంట్స్ చేశారు. నిన్న రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగిన ఆయన ఇవాళ మరోసారి సీరియస్ అయ్యారు.
మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి(Jagga Reddy) తనకు రేవంత్ రెడ్డికి మధ్య జరుగుతున్న పంచాయతీ తప్ప పార్టీతో కాదన్నారు. తాను కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తినని అన్నారు. రేవంత్ రెడ్డి వన్ మ్యాన్ షోను తాను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు.
నిజాలు మాట్లాడే వ్యక్తుల్లో తాను ఒకడినన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వాన్ని తాను ఆహ్వానిస్తున్నానని చెప్పారు. గతంలో సోనియమ్మ గురించి రేవంత్ రెడ్డి ఎలా మాట్లాడారో చూడండి అంటూ వీడియో చూపించారు.
తన పవర్స్ తగ్గించినంత మాత్రాన తన కు ఉన్న గౌరవం ఏమీ పోదన్నారు. రాజకీయంగా తనకు కేసీఆర్ కు మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు జగ్గారెడ్డి.
అసలు పంచాయతీ తనకు రేవంత్ రెడ్డికి మధ్య ఉన్నది వాస్తవమేనని అందుకే తేల్చుకునేందుకు సిద్దంగా ఉన్నానని చెప్పారు. దేశానికి బీజేపీ ప్రమాదమని, కాంగ్రెస్ వల్ల మేలు జరుగుతుందన్నారు.
ఐదు రాష్ట్రాలలో ఓడి పోయినంత మాత్రాన పార్టీ లేదనుకుంటే ఎలా అని నిలదీశారు. ఒకప్పుడు 2 సీట్లతో ఉన్న బీజేపీ ఇప్పుడు రాలేదా అని ప్రశ్నించారు.
ప్రధానంగా సోషల్ మీడియా వేదికగా తనను పార్టీ వ్యతిరేకుడిగా చిత్రీకరిస్తున్నారంటూ ఆరోపించారు. తనపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.
తనతో భట్టి, ఉత్తమ్ ఎవరూ మాట్లాడటం లేదన్నారు. మెదక్ టూర్ కు రేవంత్ రెడ్డి తనను పిలవలేదని ప్రశ్నించారు.
Also Read : పీకే కమిట్మెంట్ ఉన్న వ్యక్తి