Modi : 21వ శాతాబ్దంలో ఈశాన్య భారతం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Modi ). అదో ఛోదక శక్తిగా మారనుందన్నారు.
అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. తూర్పు ఆసియాకు ప్రధాన ద్వారంగా అరుణాచల్ ప్రదేశ్ ను మార్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు.
దేశాభివృద్ధిలో ఈశాన్య భారత దేశం ఇంజన్ గా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. అరుణాచల్ ప్రదేశ్ 36వ రాష్ట్ర స్థాపన దినోత్సవం సందర్భంగా మీ అందరికీ అభినందనలు.
50 సంవత్సరాల కిందట ఫ్రాంటియర్ ఏజెన్సీకి కొత్త పేరు వచ్చిందని చెప్పారు మోదీ. అరుణాచల్ ప్రదేశ్ గా కొత్త గుర్తింపు వచ్చింది. ఈ 50 ఏళ్లలో కష్టపడి పని చేసే, దేశ భక్తి గల సోదరులు, సోదరీమణులు ఉండడం రాష్ట్రానికి అదనపు బలం అని పేర్కొన్నారు మోదీ(Modi ).
ఈ కొత్త శక్తిని నిరంతరం శక్తవంతం చేస్తూనే ఉన్నారని ప్రశంసలతో ముంచెత్తారు. తూర్పు భారత దేశమే కాదు ఈశాన్య భారతం కూడా దేశ వృద్ధికి దోహదం చేస్తుందన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నాడు.
ఈ స్ఫూర్తితో అరుణాచల్ ప్రదేశ్ అభివృద్ధిని వేగవంతం చేసేందుకు గత 7 ఏళ్లు నుంచి అపూర్వమైన కృషి జరిగిందని చెప్పారు మోదీ.
రాష్ట్ర ప్రజలు సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకున్న తీరు దేశానికి స్ఫూర్తి దాయకమని కితాబు ఇచ్చారు ప్రధాన మంత్రి.
అరుణాచల్ ప్రదేశ్ కొత్త శిఖరాలకు తీసుకు వెళ్లిన దేశభక్తి, సామాజిక సామరస్యం, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకున్న తీరు గొప్పదన్నారు ప్రధాన మంత్రి.
Also Read : రాణే నీ జాతకం నా వద్ద ఉందన్న రౌత్