YS Jagan : ఇవాళ సందింటి జగన్ మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్సార్ సీపీ పార్టీ 11 వసంతాలు పూర్తి చేసుకుంది. 12వ ఏట అడుగు పెట్టింది. సుదీర్ఘమైన ప్రయాణం సాగింది.
ఒంటరిగా ఒక్కడే బయలు దేరి ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు అయ్యేలా తనను తాను ప్రూవ్ చేసుకున్న అరుదైన నాయకుడు జగన్ రెడ్డి(YS Jagan).
గతంలో ఎన్నడూ లేని రీతిలో ఏపీ చరిత్రలో అతి తక్కువ కాలంలోనే పార్టీని పవర్ లోకి తీసుకు రావడమే కాకుండా భారీ మెజారిటీని సాధించి పెట్టారు.
ఇది ఓ రికార్డు. ప్రతిపక్ష పార్టీకి కోలుకోలేని షాక్ ఇచ్చారు. ప్రస్తుతం జగన్ రెడ్డి సీఎంగా కొలువు తీరాక తాను పాదయాత్రలో, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో పడ్డారు.
పాలనను ప్రజల వద్దకు తీసుకు వెళ్లడంలో కృషి చేశారు. ఇంకా పాటు పడుతూనే ఉన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా భారీ ఎత్తున నియామకాలు జరిపారు.
అంతే కాదు ఆయన విద్య, వైద్యం, ఉపాధి, మహిళా సాధికారత, వ్యవసాయం, పరిశ్రమల ఏర్పాటు అంశాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ప్రధానంగా ఆయన చేపట్టిన నాడు నేడు కార్యక్రమం దేశానికి ఆదర్శంగా మారింది.
పార్టీ 12వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా పార్టీ చీఫ్, సీఎం జగన్ రెడ్డి ఇవాళ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఏ ప్రజల కోసమైతే మనం పని చేస్తున్నామో వారి కలల్ని సాకారం చేసేందుకు శతవిధాలుగా కృషి చేస్తున్నామని అన్నారు.
రాబోయే రోజుల్లో దేశానికి ఏపీ అన్ని రంగాలలో ఆదర్శంగా ఉండేలా చేస్తానని చెప్పారు. ప్రతి ఒక్కరు బతికేందుకు కావాల్సిన సదుపాయాలు కల్పిస్తానని పేర్కొన్నారు.
ఎక్కడా లేని రీతిలో సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు ఒక్క ఏపీలోనే అమలవుతున్నాయని తెలిపారు.
Also Read : అన్నింటికీ కారణం బాబేనట