Ashwini Vaishnaw : విచారణ తర్వాత కారణాలు వెల్లడి
కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్
Ashwini Vaishnaw : ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్ జిల్లాలో చోటు చేసుకున్న రైళ్లు ఢీకొన్న ప్రమాద ఘటనలో ఇప్పటి వరకు భారీ ఎత్తున ప్రాణ నష్టం జరిగింది. ఘటన జరిగిన వెంటనే విషయం తెలుసుకున్న కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్(Ashwini Vaishnaw) శనివారం బాలా సోర్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా బోగీలను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు అశ్విని వైష్ణవ్.
ఒడిశా రైలు ప్రమాదానికి గల కారణాలు విచరాణ తెలుస్తాయని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్లు, క్షతగాత్రుల చికిత్స పైనే దృష్టి సారించామని చెప్పారు. ఇప్పటి వరకు 288కి పైగా చని పోయారని గాయపడిన వారి సంఖ్య 1,000కి చేరుకుందని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
ఈ ప్రమాద ఘటనపై విచారణ జరిపేందుకు ఇప్పటికే ఉన్నత స్థాయి కమిటీని ప్రకటించామని రైల్వే శాఖ మంత్రి ప్రకటించారు. రైల్వే సేఫ్టీ కమిషనర్ ను పిలిపించామని , ఆయనతో కూడా విచారణ జరిపి ప్రమాదానికి గల కారణాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు కేంద్ర మంత్రి.
మరణించిన వారి కుటుంబాలకు, వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నామని తెలిపారు. జాతీయ విపత్తు దళం, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం, ప్రభుత్వ బృందాలు నిన్న రాత్రి నుంచి సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నాయని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. తాను ఎందుకు రాజీనామా చేయాలని ఆయన ప్రశ్నించారు.
Also Read : Bandi Sanjay
