Kiren Rijiju : కేసుల పెర‌గ‌డం వ్య‌వ‌స్థ త‌ప్పు – రిజిజు

కేంద్ర న్యాయ శాఖ మంత్రి కామెంట్స్

Kiren Rijiju SC Cases : కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న సుప్రీంకోర్టును, కొలీజియం వ్య‌వ‌స్థ‌ను తూర్పార బ‌డుతూ వ‌స్తున్నారు. దీనిపై ఇప్ప‌టికే భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ స్థానం తీవ్రంగా అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. న్యాయ స్థానాల‌లో కేసుల బ్యాక్ లాగ్ ల‌ను త‌గ్గించేందుకు ప‌రిష్కారం చూడాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. భారీ ఎత్తున కేసులు పెండింగ్ లో ఉండ‌డం మంచిది కాద‌న్నారు కిరెన్ రిజిజు.

ఇప్ప‌టికే దేశంలో కేసుల సంఖ్య 4.90 కోట్లు దాటింద‌న్నారు కేంద్ర న్యాయ శాఖ మంత్రి. ఇదే స‌మ‌యంలో కేసుల పెండింగ్ ను త‌గ్గించేందుకు న్యాయ మంత్రిత్వ శాఖ అనేక చ‌ర్య‌లు చేప‌డుతోంద‌ని చెప్పారు. పెరుగుతున్న కేసుల పెండింగ్ పై ఆందోళ‌న వ్య‌క్తం చేశారు కిరెన్ రిజిజు(Kiren Rijiju SC Cases). ఇది న్యాయ‌మూర్తుల త‌ప్పు కాద‌న్నారు. కానీ పూర్తిగా ఇది వ్య‌వ‌స్థ చేసిన త‌ప్పుగా కేంద్ర మంత్రి పేర్కొన్నారు. అన‌వ‌స‌ర‌మైన , వాడుక లో లేని చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయ‌డం, కోర్టుల మౌలిక స‌దుపాయాల‌ను మెరుగు ప‌ర్చ‌డం , సాంకేతిక‌త‌తో వాటిని స‌న్నద్దం చేయ‌డం అత్యంత ముఖ్య‌మ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు.

శ‌నివారం ఉద‌య్ పూర్ లోని మోహ‌న్ లాల్ సుఖాడియా యూనివ‌ర్శిటీలో లా క‌మిష‌న్ ఆఫ్ ఇండియా ఆద్వ‌ర్యంలో స‌స్టెయిన‌బుల్ డెవ‌ల‌ప్ మెంట్ ఇన్ ఇండియా – ఎవ‌ల్యూష‌న్ అండ్ లీగ‌ల్ పెర్స్ పెక్టివ్ అనే అంశంపై కిరెన్ రిజిజు(Kiren Rijiju) ప్ర‌సంగించారు. ఈ కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఏ దేశంలో లేదా స‌మాజంలో ఇన్ని కేసులు ఉండ‌టం మంచిది కాద‌న్నారు.

Also Read : స్టాండింగ్ క‌మిటీ స‌భ్యుల ఎన్నిక వాయిదా

Leave A Reply

Your Email Id will not be published!