Revanth Reddy : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఇవాళ. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పార్టీ పరంగా, వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన మహిళలను సత్కరించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.
ఈ కార్యక్రమంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి(Revanth Reddy )మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు. పార్టీ బలోపేతం చేయడంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారంటూ కొనియాడారు.
మరింత గా కష్ట పడాలని పిలుపునిచ్చారు. మనకు సమయం తక్కువగా ఉందని దానిని గుర్తించి ఇంకాస్త ఫోకస్ పెడితే రాబోయే రోజుల్లో మనమే పవర్ లోకి వస్తామన్నారు.
దేశంలో ఏ పార్టీ చేయని విధంగా యూపీలో కాంగ్రెస్ పార్టీ 40 శాతం సీట్లను మహిళలకు కేటాయించిందన్నారు. ఇక్కడ కూడా కష్టపడే వారికి సముచిత స్థానం కల్పించడం జరుగుతుందని చెప్పారు.
డిజిటల్ సభ్యత్వాల నమోదులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే టాప్ లో ఉందన్నారు. ఈ ఘనత సాధించడంలో మహిళలు, కార్యకర్తలు, నాయకురాళ్ల పాత్ర కూడా ఉందని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి.
మహిళా దినోత్సవం రోజున మహిళా మణులతో కలిసి జరుపు కోవడం తనకు సంతోషం కలిగిస్తోందన్నారు. గతంలో కంటే ఇప్పుడు ఎనలేని అవకాశాలు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవడంలో మహిళలు కూడా భాగస్వాములు అవుతున్నారని చెప్పారు.
మహిళలు మరింత క్రియాశీలకంగా మారాలని కోరారు టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి.
Also Read : తనని చంపేస్తారని వివేకాకు ముందే తెలుసంటున్న రేణుక