Modi : హ‌నుమంతుడి త్యాగం స్మ‌ర‌ణీయం

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ

Modi : హ‌నుమంతుడి బోధించిన నిస్వార్థ సేవా భావం , భ‌క్తి భావాలు భార‌త దేశాన్ని బ‌లోపేతం చేస్తాయ‌ని పేర్కొన్నారు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ(Modi). ఈ దేశం బ‌లోపేతం కావ‌డంలో ఆధ్యాత్మిక అనుసంధాన‌మై ఉంద‌న్నారు.

దేశం ప‌ట్ల గౌర‌వ భావం, అంకిత భావం ప్ర‌జ‌ల్లో ఉండ‌డం గ‌ర్వించ ద‌గిన విష‌య‌మ‌ని పేర్కొన్నారు ప్ర‌ధాన‌మంత్రి. దేశంలో స్వాతంత్ర పోరాటం ప్రారంభ‌మైన 1857కి ముందు ప్ర‌జ‌ల‌లో ఆధ్యాత్మిక జాగృతిని సృష్టించ‌డం ద్వారా దేశ ఆధ్యాత్మిక నాయ‌కులు కొత్త బ‌లాన్ని అందించార‌ని కొనియాడారు.

ఇవాళ భార‌త దేశం స్త‌బ్దుగా ఉండ‌లేక పోతోందున్నారు. మ‌నం ఉన్న చోట‌నే మ‌నం కొన‌సాగ‌లేమ‌న్నారు. ప్ర‌పంచ‌మంతా ఆత్మ నిర్భ‌ర ఎలా మారాలో అని ఆలోచిస్తున్న‌ట్లు ప్ర‌పంచ ప‌రిస్థితి ఉంద‌న్నారు ప్ర‌ధాన మంత్రి.

గుజ‌రాత్ లోని మోర్బీలో 108 అడుగుల ఎత్తైన హ‌నుమంతుడి విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా న‌రేంద్ర మోదీ మాట్లాడారు.

రానున్న 25 ఏళ్ల పాటు దేశంలోని ప్ర‌జ‌లంతా స్థానికంగా త‌యార‌య్యే వ‌స్తువుల‌ను వినియోగిస్తే దేశం నిరుద్యోగ స‌మ‌స్య‌ను ఎదుర్కోవాల్సిన అవ‌స‌రం ఉండ‌ద‌న్నారు.

స్వ‌యం స‌మృద్దిగా మారాల‌ని పిలుపునిచ్చారు న‌రేంద్ర మోదీ(Modi). అంతే కాకుండా దేశంలోని సాధువులు, గురువులు, బోధ‌కుల్ని స్థానిక ఉత్ప‌త్తుల‌ను మాత్ర‌మే కొనుగోలు చేయాల‌ని ప్ర‌జ‌ల‌కు బోధించాల‌ని తాను అభ్య‌ర్థిస్తాన‌ని చెప్పారు.

లోక‌ల్ కోసం వోక‌ల్ అనేది ఉప‌యోగించాల‌న్నారు మోదీ. విదేశీ వ‌స్తువుల‌కు స్వ‌దేశీ వ‌స్తువుల‌కు మ‌ధ్య భారీ తేడా ఉంటుంద‌న్నారు ప్ర‌ధాని. మ‌న ప్ర‌జ‌ల శ్ర‌మ‌తో త‌యారు చేసిన వాటికి ఎక్కువ ఆద‌ర‌ణ ఉండాల‌న్నారు.

Also Read : రాములోరి క‌ళ్యాణం క‌మ‌నీయం

Leave A Reply

Your Email Id will not be published!