Wang Wenbin : సరిహద్దులో పరిస్థితి స్థిరంగా ఉంది – చైనా
విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్నిన్
Wang Wenbin : తాము అర్థం చేసుకున్నంత వరకు చైనా – భారత్ సరిహద్దు పరిస్థితి మొత్తం స్థిరంగా ఉందన్నారు చైనా. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్. ఇరు దేశాల దళాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న తర్వాత స్పందించారు.
మంగళవారం వాంగ్ వెన్బిన్(Wang Wenbin) మీడియాతో మాట్లాడారు. దౌత్య, సైనిక మార్గాల ద్వారా సరిహద్దు సమస్యై ఇరు పక్షాలు అడ్డంకులు లేని సంభాషణను కొనసాగించాయని చెప్పారు. డిసెంబర్ 9న ఈ ఘటన చోటు చేసుకుంది.
గత వారం అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ లో ఇరు పక్షాలు ఘర్షణ పడ్డాయని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు. అయితే భారత్ చేసిన ఆరోపణలపై వెన్బిన్ వ్యాఖ్యానించేందుకు స్పందించక పోవడం విశేషం. దౌత్య, సైనిక మార్గాల ద్వారా సరిహద్దు సమస్యపై ఇరు పక్షాలు అంతటా అవరోధం లేని సంభాషణను కొనసాగించాయి. చైనా దిశలో భారత దేశం కూడా ముందుకు సాగుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు వాంగ్ వెన్బిన్.
ఇద్దరు నేతలు కుదుర్చుకున్న ముఖ్యమైన ఏకాభిప్రాయాన్ని తీవ్రంగా అమలు చేయాలని, ఇరు పక్షాలు సంతకం చేసిన ఒప్పందాల మేరకు కచ్చితంగా కట్టుబడి ఉండాలని కోరారు. చైనా భారత్ సరిహద్దు ప్రాంతంలో శాంతియువత వాతావరణం నెలకొనాల్సిన అవసరం ఉందన్నారు విదేశాంగ శాఖ మంత్రి(Wang Wenbin).
తాము ప్రశాంతతను కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు చైనా విదేశాంగ ప్రతినిధి. ఇదిలా ఉండగా 2020లో జరిగిన ఘర్షణల నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి.
Also Read : మోడీ ఉన్నంత వరకు టచ్ చేయలేరు