Jai Shankar : చర్చల ద్వారానే యుద్దానికి పరిష్కారం
రష్యాతో స్పష్టం చేసిన కేంద్ర మంత్రి జై శంకర్
Jai Shankar : కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత దేశం మొదటి నుంచీ యుద్దాన్ని కోరుకోవడం లేదని మరోసారి స్పష్టం చేశారు. రష్యాలో పర్యటిస్తున్న జై శంకర్(Jai Shankar) మంగళవారం రష్యాతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య కీలక అంశాలు చర్చకు వచ్చాయి.
ప్రపంచంలో చోటు చేసుకున్న పరిస్థితులు, నిర్దిష్ట ప్రాంతీయ ఆందోళనలను పరిష్కరించేందుకు భారత్, రష్యా చర్చించిందన్నారు జై శంకర్. గత కొన్ని సంవత్సరాలుగా కరోనా మహమ్మారి , ఆర్థిక ఒత్తిళ్లు, వాణిజ్య ఇబ్బందులు ప్రధాన అవరోధంగా మారాయని అభిప్రాయపడ్డారు.
ఈ కారణాలే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయని స్పష్టం చేశారు జై శంకర్. రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్దం జరుగుతున్న సమయంలో భారత్, రష్యా దేశాలు చర్చలు జరుపుతున్నాయి. ఇవాళ రష్యా రాజధాని మాస్కోలో రష్యా విదేశాంగ శాఖ మంత్రి లావ్ రోవ్ తో సమావేశం అయ్యారు.
సంభాషణకు తిరిగి రావాలని రష్యాకు సూచించారు జై శంకర్(Jai Shankar). యుద్దం ఎంత మాత్రం మంచిది కాదని సూచించారు. ఉక్రెయిన్ , రష్యా పంతాలకు పోవద్దని ఇరు దేశాల అధ్యక్షులు జెలెన్ స్కీ, పుతిన్ లు కలిసి చర్చించుకుంటే బాగుంటుందన్నారు జై శంకర్.
ప్రస్తుతం ప్రపంచం ముందున్న అతి పెద్ద సవాల్ ఒక్కటే ఉంది. అది ఉక్రెయిన్, రష్యా మధ్య కొనసాగుతున్న యుద్దమేనని పేర్కొన్నారు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి. ప్రస్తుతం భారత్ రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తోంది.
Also Read : ఈశాన్య భారతంలో ప్రతి ఊరికి 4జీ సేవలు