Modi : రోజు రోజుకు టెక్నాలజీ మారుతోంది. వ్యవస్థలన్నీ ఇప్పుడు టెక్నాలజీ లేనిదే నడవడం లేదు. ప్రతి అవసరానికి సాంకేతికత అన్నది ఊతంగా మారింది. దీనిని మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Modi).
టెక్నాలజీ రంగాలలో దేశం స్వయం సమృద్దిని సాధించాలని పిలుపునిచ్చారు. ఈ రంగం ఒక్కటి అభివృద్ది చెందితే లక్షలాది మందికి ఉపాధి లభిస్తుందని అభిప్రాయపడ్డారు.
సైన్స్ అండ్ టెక్నాలజీ ముడిపడి ఉందన్నారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ మరింత ఊపు లభిస్తుందన్నారు. ఇదిలా ఉండగా సాంకేతిక ఆధార అభివృద్ధిపై సెమినార్ నిర్వహించారు.
ఈ సందర్భంగా వర్చువల్ గా ప్రధాని మోదీ మాట్లాడారు. టెలికమ్యూనికేషన్ , అందులోనూ 5జీ టెక్నాలజీ ప్రధానంగా వృద్ధికి ఊతం ఇవ్వడమే కాకుండా ఉద్యోగ అవకాశాలను కల్పించ గలదన్నారు.
2022-23 లో 5 జీ మొబైల్ సర్వీసులు ప్రారంభం అయ్యేందుకు వీలుగా అవసరమైన స్పెక్ట్రమ్ వేలాన్ని ఈ ఏడాదిలో నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు.
ఈ వెబినార్ లో ప్రైవేట్ , ప్రభుత్వ రంగాలకు చెందిన ప్రతినిధులు, నిపుణులు పాలు పంచుకున్నారు. కాగా మోదీ(Modi) అడిగిన పలు సందేహాలకు సమాధానాలు ఇచ్చారు.
అంతే కాకుండా టెక్నాలజీ ముఖ్య పాత్ర పోషిస్తోందన్నారు. మెడికల్ పరికరాలను తయారు చేయడంపై కూడా ఫోకస్ పెట్టాలని సూచించారు మోదీ.
మేకిన్ ఇండియా ప్రాజెక్టుల ద్వారా నైపుణ్యాభివృద్ధి దగ్గర నుంచి తయారీ దాకా ప్రయత్నం చేయాలన్నారు. టెక్నాలజీ రంగం దేశానికి బలం అని పేర్కొన్నారు.
దేశీయ పరంగా అంకురాల అభివృద్ధికి సహకరిస్తున్నామని ఈ మేరకు కోట్లాది రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు.
Also Read : మనోళ్లను సురక్షితంగా తీసుకు వస్తాం