Indigo CEO : ఆ ఘటన బాధాకరం – సీఇఓ
రోనోజోయ్ దత్తా ఆగ్రహం
Indigo CEO : రాంచీ విమానాశ్రయంలో చోటు చేసుకున్న ఘటన తీవ్ర దుమారం రేపింది. దీనిపై కేంద్ర విమానాయన శాఖ మంత్రి జ్యోతిరాదిత్యా సింధియా సీరియస్ అయ్యారు.
విచారణకు ఆదేశించారు. తప్పు అని తేలితే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. దివ్యాంగ చిన్నారి ఫ్లైట్ ఎక్కేందుకు ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బంది నిరాకరించారు.
ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు సంస్థ సిఇఓ రోనోజోయ్ దత్తా(Indigo CEO). ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఆ చిన్నారి కోసం ఎలక్ట్రికల్ వీల్ చైర్ ను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించారు
. శారీరక వికలాంగుల సంరక్షణ కోసం తమ జీవితాలను అంకితం చేసే పేరెంట్స్ ఈ సమాజినికి కనిపించే హీరోలంటూ ఆయన స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా బాదిత కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఇలాంటి ఘటన జరిగి ఉండకూడదు. క్షమాపణ కోరుతున్నా.
మా కస్టమర్లకు మర్యాద పూర్వకంగా , దయతో కూడిన సేవను అందించడమే లక్ష్యమని స్పష్టం చేశారు సిఇఓ.
ఇదిలా ఉండగా సెక్యూరిటీ మార్గదర్శకాలకు అనుగుణంగా విమానాశ్రయ సిబ్బంది నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వెల్లడించారు.
ఈ ఘటనపై తానే స్వయంగా విచారణ చేపడతానంటూ కేంద్ర మంత్రి సింధియా ప్రకటించడం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
ట్విట్టర్ వేదికగా ఇండిగో సిబ్బంది దివ్యాంగురాలైన చిన్నారి పట్ల ప్రవర్తించిన తీరుపై తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి.
ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ ఇదే ట్రెండింగ్ లో ఉంది. చివరకు సిఇఓ స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చింది.
Also Read : దేశ ద్రోహం చట్టంపై పునః పరిశీలన