Bandi Sanjay : సిట్టింగ్ జ‌డ్జితో విచార‌ణ చేప‌ట్టాలి

బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజ‌య్

Bandi Sanjay Kumar TSPSC  : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్ పీఎస్సీ) లో చోటు చేసుకున్న లీకు వ్య‌వ‌హారంపై మ‌రోసారి స్పందించారు భార‌తీయ జ‌న‌తా పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజ‌య్. త‌ప్పు ఎవ‌రు చేసినా త‌ప్పేన‌ని పేర్కొన్నారు. తాము మొద‌టి నుంచి సిట్ తో ద‌ర్యాప్తును వ్య‌తిరేకిస్తున్నామ‌ని అన్నారు. శ‌నివారం బండి సంజ‌య్ మీడియాతో(Bandi Sanjay Kumar TSPSC) మాట్లాడారు.

ప‌రీక్ష‌ల లీకుల‌కు సంబంధించి ఇద్ద‌రినే బాధ్యుల‌ను ఎలా చేస్తారంటూ ప్ర‌శ్నించారు. సిట్ తో కాకుండా సీబీఐతో లేదా సిట్టింగ్ జ‌డ్జితో విచార‌ణ జ‌రిపించేందుకు ఉన్న అభ్యంత‌రాలు ఏమిటో ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌న్నారు బండి సంజ‌య్.

పేప‌ర్ లీక్ ఘ‌ట‌న కార‌ణంగా 30 ల‌క్ష‌ల మంది విద్యార్థుల భ‌విష్య‌త్ అంధ‌కారంలో ప‌డి పోయింద‌న్నారు బీజేపీ స్టేట్ చీఫ్‌. లీకుల వెనుక ఉన్న‌ది ఎవ‌రో తేల్చాల్సిన బాధ్య‌త స‌ర్కార్ పై ఉంద‌న్నారు. కేటీఆర్ త‌న‌ను టార్గెట్ చేయ‌డంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఓ వైపు అభ్య‌ర్థులు రోడ్డెక్కి ఆందోళ‌న‌లు చేస్తుంటే అక్ర‌మంగా అరెస్ట్ చేస్తున్నార‌ని ఆరోపించారు. త‌మ వారిని వెంట‌నే విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేశారు బండి సంజ‌య్.

మ‌రో వైపు సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. త‌న కూతురును ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో చిక్క‌కుండా ఉండేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఎందుకు బాధ్య‌త‌తో చైర్మ‌న్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేయ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. ఇన్నాళ్లు టీఎస్ పీఎస్సీ లో ప‌ని చేస్తున్న వాళ్ల‌ను ఎందుకు గుర్తించ లేద‌ని ప్ర‌శ్నించారు.

Also Read : న‌డిగ‌డ్డ హ‌క్కుల కోసం పోరాటం

Leave A Reply

Your Email Id will not be published!