Waqf Board Chairman : వ‌క్ఫ్ బోర్డు చైర్మ‌న్ త‌ప్పుకోవాల్సిందే

మ‌హమూద్ అలీని ఆదేశంచిన టీఆర్ఎస్

Waqf Board Chairman : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన హైద‌రాబాద్ జూబ్లీ హిల్స్ అమ్నేషియా మైన‌ర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసు. ఈ ఘ‌ట‌న‌లో ఆరుగురు నిందితులు పాల్గొన్నార‌ని న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ సీవీ ఆనంద్ వెల్ల‌డించారు.

నిందితులు గ్యాంగ్ రేప్ కు పాల్ప‌డిన ఇన్నోవా కారు పై పెద్ద ఎత్తున రాద్దాంతం జ‌రిగింది. ఇదే స‌మ‌యంలో హోం శాఖ మంత్రి మ‌హమూద్ అలీ మ‌నవ‌డి పేరు కూడా వ‌చ్చింది.

విచార‌ణ అనంత‌రం అత‌డి ప్రమేయం లేద‌ని ప్ర‌క‌టించారు సీపీ. అన్ని పార్టీలు పెద్ద ఎత్తున వ‌క్ఫ్ బోర్డు చైర్మ‌న్(Waqf Board Chairman) మ‌సీవుల్లా కొడుకు ఉండ‌డంతో ఆ ప‌ద‌వి నుంచి త‌ప్పు కోవాల‌ని డిమాండ్ చేశాయి.

ఈ మేర‌కు టీఆర్ఎస్ తాజాగా చైర్మ‌న్ ప‌ద‌వి నుంచి వైదొల‌గాల‌ని ఆదేశించింది. ఆయ‌న‌కు సంబంధించిన కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అత‌డిని త‌ప్పించే బాధ్య‌త‌ను రాష్ట్ర హోం శాఖ మంత్రి మ‌హ‌మూద్ అలీకి అప్ప‌గించింది. దీంతో వెంట‌నే త‌ప్పు కోవాల‌ని సూచించారు అలీ మ‌సీవుల్లాకు. ఇదిలా ఉండ‌గా గ్యాంగ్ రేప్ జ‌రిగిన ఇన్నోవా కారు గురించే పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది.

దీనికి సంబంధించి పోలీసులు ఇది అధికారిక వాహ‌నమా లేక వ‌క్ఫ్ బోర్డు చైర్మ‌న్(Waqf Board Chairman) వ్య‌క్తిగ‌తంగా వాడుతున్న వెహికలా అన్న దానిపై స్ప‌ష్టత రాలేదంటున్నారు.

ఈ వాహ‌నాన్ని 2019లో దీనిని ఖ‌రీదు చేశారు. దినాజ్ జ‌హాన్ పేరుపై ఉంద‌ని తెలిపారు. ఈ వెహికిల్ కు సంబంధించి వివ‌రాలు కోరుతూ దినాజ్ జ‌హాన్ తో పాటు వ‌క్ఫ్ బోర్డుకు నోటీసులు ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు.

కాగా గ్యాంగ్ రేప్ కు సంబంధించి పూర్తి నివేదిక ఇవ్వాల‌ని గ‌వ‌ర్న‌ర్ ఆదేశించ‌డం తెలిసిందే.

Also Read : వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు నేత‌ల‌పై కేసులు

Leave A Reply

Your Email Id will not be published!