UAE Minister : జై శంకర్ పనితీరుకు యూఏఈ మంత్రి ఫిదా
ఒమర్ సుల్తాన్ అల్ ఒలామా కామెంట్
UAE Minister : భారత దేశ విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్ కు ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్ దేశ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఓ బహిరంగ సభలో జై శంకర్(S Jai Shankar) ను ఆకాశానికి ఎత్తేశారు. భారత దేశ విదేశాంగ విధానం ప్రపంచంలోనే అత్యుత్తమంగా ఉందన్నారు.
ప్రధానంగా జై శంకర్ అమెరికా మీడియా అడిగిన ప్రశ్నలకు దిమ్మ తిరిగేలా సమాధానాలు ఇచ్చారని కొనియాడారు. మీరు రష్యాతో ఎందుకు ఆయిల్ కొనుగోలు చేస్తున్నారన్న ప్రశ్నకు జై శంకర్ షాకింగ్ సమాధానం ఇచ్చారు. మీరు రష్యాతో గ్యాస్ కొనుగోలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నించారు.
ప్రపంచ మార్కెట్ లో ఎక్కడ తక్కువ ధరకు దొరికితే అక్కడ దేశాలు కొనుగోలు చేస్తాయని దీనిని మీరు కాదంటారా అని నిలదీశారు. ఇక తాజాగా బుధవారం ఢిల్లీలో జరిగిన థింక్ ట్యాంక్ లో జరిగిన సమావేశంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ) మంత్రి(UAE Minister) ఒమర్ సుల్తాన్ అల్ ఒలామా కీలక వ్యాఖ్యలు చేశారు.
జై శంకర్ పనితీరు అద్భుతంగా ఉందంటూ ప్రశంసించారు. ఆయన పనితీరుకు తాము ఫిదా అయ్యామంటూ పేర్కొన్నారు. భౌగోళిక రాజకీయ టగ్ ఆఫ్ వార్ మధ్య ప్రపంచ వేదికపై భారతదేశ విదేశాంగ విధానాన్ని ఎలా ఉంచాలో తనను బాగా ఆకట్టుకుందన్నారు. ఏకధ్రువ ప్రపంచంలో జై శంకర్ కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు.
యూఏఈ, భారత్ దేశాల మధ్య సత్ సంబధాలు కొనసాగుతున్నాయని దీనికి ప్రధాన కారణం విదేశాంగ శాఖ మంత్రి అని కొనియాడారు.
Also Read : యుద్ధానికి వ్యతిరేకం శాంతికి సుముఖం