TTD Chairman : టీటీడీ ఆస్తుల విలువ రూ. 85,705 కోట్లు
ఆలయ ట్రస్టు ఆస్తులపై శ్వేతపత్రం రిలీజ్
TTD Chairman : తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి(TTD Chairman) కీలక ప్రకటన చేశారు. ఆయన స్వామి వారి ఆలయానికి సంబంధించిన మొత్తం ఆస్తులు ఎన్ని ఉన్నాయనే దానిపై క్లారిటీ ఇచ్చారు.
ఇందుకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేసినట్లు ప్రకటించారు. ఇప్పటి వరకు తిరుమల తిరుపతి దేవస్థానం వద్ద మొత్తం 960 స్థిరాస్థులు ఉన్నాయని తెలిపారు.
మొత్తం ఆస్తులకు సంబంధించి వాటి విలువ రూ. 85,705 కోట్లు అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా తిరుమల లోని అన్నమయ్య భవన్ లో టిటీడీ పాలక మండలి సమావేశం జరిగింది.
అనంతరం టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి(TTD Chairman) సమావేశంలో చర్చించిన అంశాల గురించి వెల్లడించారు. గత కొంత కాలంగా కరోనా కారణంగా దర్శనంలో కొంత ఇబ్బంది ఉండిందని కానీ రాను రాను తగ్గుముఖం పట్టడంతో భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు.
భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని కొన్ని నిర్ణయాలు తీసుకుందన్నారు. పురటాసి మాసం తర్వాత దశల వారీగా అమలు చేస్తామని చెప్పారు వైవీ సుబ్బారెడ్డి.
తిరుమలలో భక్తులకు అందుబాటులో ఉన్న వసతి పరిమితులలో ఇబ్బందుల దృష్ట్యా వసతి కేటాయింపు విధానాన్ని తిరుపతికి మార్చాలని టీటీడీ బోర్డు నిర్ణయించిందన్నారు.
తిరుమలలో సామాన్య భక్తులకు వసతి సౌకర్యాలను పెంచుతున్నట్లు తెలిపారు. గోవర్దన సత్రాల వెనుక భాగంలో రూ. 95 కోట్లతో పీఏసీ -5, రూ. 30 కోట్లతో వకుళమాత ఆలయం నుంచి జూపార్కు దాకా కనెక్టివిటీ రింగ్ రోడ్డు నిర్మిస్తామని తెలిపారు.
సర్వ దర్శనం టోకెన్లను తిరిగి ప్రవేశ పెట్టనున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 10 గంటల తర్వాత వీఐపీ బ్రేక్ దర్శనాలు ప్రారంభించాలని యోచిస్తున్నట్లు చెప్పారు.
Also Read : డిజిటల్ హెల్త్ సర్వీసెస్ లో ఏపీ టాప్