Rahul Gandhi : విపక్షాల విజయం ఖాయం – రాహుల్
2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు తథ్యం
Rahul Gandhi : ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో విపక్షాలతో కూడిన మహా కూటమి విజయం సాధించడం ఖాయమని జోష్యం చెప్పారు. ఆరు రోజుల పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ(Rahul Gandhi) అమెరికాలోని వాషింగ్టన్ లో నేషనల్ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. ఇతర ప్రతిపక్ష పార్టీలతో కాంగ్రెస్ పార్టీ చర్చలు జరుపుతోందని స్పష్టం చేశారు. అవకాశ వాద రాజకీయాలను ప్రజలు ఈసడించు కుంటున్నారని చెప్పారు. దేశానికి కావవాల్సింది మతం కాదు మానవత్వం కావాలని పేర్కొన్నారు.
కులం పేరుతో, మతం పేరుతో, విద్వేషాల ప్రాతిపదికన రాజకీయాలు చేస్తూ ఓట్లను కొల్లగొట్టాలని భారతీయ జనతా పార్టీ దాని అనుబంధ సంస్థలు ప్రయత్నం చేస్తున్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. బీజేపీని గద్దె దించగలమన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. మీరు లెక్కలు చూడకండి కేవలం వచ్చే రిజల్ట్స్ పూర్తిగా భిన్నంగా ఉంటాయని పేర్కొన్నారు.
ప్రతిపక్షాలతో నిరంతరం చర్చలు కొనసాగుతున్నాయి. అయితే సీట్ల పంపకం విషయంలోనే కొద్దిగా ఇబ్బందులు రావడం పరిపాటి. వీటిపైనే ఎక్కుగా చర్చ జరుగుతోందన్నారు. అన్ని పార్టీలతో కలుపుకుని మహా ప్రతిపక్ష కూటమిగా తయారవుతుందని రాహుల్ గాంధీ చెప్పారు.
ఇదిలా ఉండగా పరువు నష్టం కేసులో దోషిగా తేలిన కారణంగా తన పార్లమెంట్ సభ్యత్వాన్ని కోల్పోవడాన్ని లైట్ గా తీసుకున్నారు. ఇది తనకు మంచిదే అయ్యిందన్నారు. ప్రజల వాయిస్ ను వినిపిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు రాహుల్ గాంధీ.
Also Read : MK Stalin