Bhagwant Mann : జయహో సీఎం భగవంత్ మాన్
మంత్రి తొలగింపు..అరెస్ట్ కు ఆదేశం
Bhagwant Mann : కష్టపడి నటుడిగా మారి ఎన్నో అవమానాలు ఎదుర్కొని చివరకు పంజాబ్ ముఖ్యమంత్రిగా కొలువు తీరిన
భగవంత్ మాన్ సంచలన(Bhagwant Mann) నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ ఆయన తీసుకున్న నిర్ణయం యావత్ దేశాన్ని ఒక్కసారిగా తన వైపు చూసేలా చేసింది.
భగవంత్ మాన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తాను ప్రజల మనిషినని ప్రకటించారు. రాజ్ భవన్ లో కాకుండా తను నిత్యం ఆరాధించే షహీద్ భగత్ సింగ్ పుట్టిన కొంగర్ కలాన్ లో ప్రమాణ స్వీకారం చేశారు.
ఇక అవినీతి రహిత పంజాబ్ ను తయారు చేయడమే తన లక్ష్యమని ప్రకటించారు. ఇదే సమయంలో ఎవరైనా అవినీతికి పాల్పడినా లేదా లంచం డిమాండ్ చేసినా వెంటనే తన ఫోన్ నెంబర్ కు కాల్ చేయాలని లేదా మెస్సేజ్ , వీడియో తీసి వాట్సాప్ ద్వారా పంపించాలని పిలుపునిచ్చారు.
తాజాగా తన మంత్రివర్గంలో ఉన్న ఆరోగ్య శాఖ మంత్రి విజయ్ సింగ్లా వ్యవహారంపై పలు ఆరోపణలు వచ్చాయి. గోప్యంగా విచారణ జరిపించారు. తన విచారణలో సింగ్లా టెండర్లలో 1 శాతం కమీషన్ డిమాండ్ చేయడం వెల్లడైంది. వెంటనే ఇవాళ మంత్రివర్గంతో సమావేశమైన
భగవంత్ మాన్ సంచలన ప్రకటన చేశాడు.
ఆరోగ్య శాఖ మంత్రి విజయ్ సింగ్లాను కేబినెట్ నుంచి తొలగిస్తున్నట్లు వెల్లడించారు. అంతే కాదు ఆయనను వెంటనే కేసు నమోదు చేసి, అరెస్ట్ చేయాలని ఆదేశించారు సీఎం.
దాంతో ఆయనను తొలగించిన వెంటనే అవినీతి నిరోధక శాఖ విజయ్ సింగ్లాను అరెస్ట్ చేసింది. ఒక ముఖ్యమంత్రి తన స్వంత సహచర
కేబినెట్ మంత్రిని తొలగించడం దేశ చరిత్రలో ఇది రెండోసారి.
2015లో కేజ్రీవాల్ ఇదే పని చేశారు. ఈ సందర్బంగా ఆప్ కన్వీనర్ , ఢిల్లీ సీఎం భగవంత్ మాన్(Bhagwant Mann) ను అభినందించారు.
10 రోజుల కిందట ఓ అధికారి సీఎంఓకు ఫిర్యాదు చేశారు.
తనకు అండగా ఉంటానని, మంత్రులకు భయపడ వద్దని హామీ ఇచ్చారు భగవంత్ మాన్(Bhagwant Mann). తానే స్వయంగా ఆ
అధికారితో ఆపరేషన్ చేపట్టారు. మంత్రితో పాటు సహచరులు కూడా ఇందులో పాల్గొనడం రుజువైంది.
ఈ మేరకు అతడిని వేటు వేశారు. పంజాబ్ సీఎంను చూస్తే నాకు గర్వంగా ఉంది. ఈ రోజు దేశం ఆప్ పట్ల గర్వంగా ఉందన్నారు.
Also Read : ఆరోగ్య మంత్రిపై పంజాబ్ సీఎం వేటు