PM Modi : యావత్ ప్రపంచం భారత్ వైపు చూస్తోంది -మోదీ
జర్మనీలో ప్రవాస భారతీయులతో ప్రధాని
PM Modi : ప్రస్తుతం యావత్ ప్రపంచమంతా భారత దేశం వైపు చూస్తోందని చెప్పారు దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ(PM Modi). రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని ఆదివారం జర్మనీకి చేరుకున్నారు. మోదీకి అపూర్వమైన స్వాగతం లభించింది.
ప్రవాస భారతీయులు ప్రధానిని కలిసేందుకు పెద్ద ఎత్తున బారులు తీరారు. ఈ సందర్భంగా జర్మనీ లోని మ్యూనిచ్ నగరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగించారు.
నాల్గవ పారిశ్రామిక విప్లవలంలో భారత దేశం వెనుకబడి ఉందని, కానీ ఇప్పుడు ప్రంపచానికి నాయకత్వం వహించే స్థాయికి చేరుకుందని చెప్పారు.
ఈ సందర్భంగా దేశంలో ఆనాటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీని గుర్తు చేసుకున్నారు. ఏది ఏమైనా ప్రపంచంలోనే గొప్పనైన సాధనం ఏదైనా ఉందంటే అది ప్రజాస్వామ్యం మాత్రమేనని చెప్పారు.
ఒక సాధారణ ఛాయ్ వాలా నుండి ప్రారంభైన తన జీవితం ఇవాళ ప్రధాని స్థాయికి ఎదిగేలా చేసిందని అన్నారు. ఇదంతా డెమోక్రసీ వల్లనే సాధ్యమైందని గుర్తించాలన్నారు ప్రధాన మంత్రి.
మనమంతా భారతీయులం. మన ప్రజాస్వామ్యం ఎంత గొప్పదో ఇతర దేశాలు గుర్తించేలా చేయాలని పిలుపునిచ్చారు మోదీ. ప్రపంచానికి భారత దేశం తల్లిలాగా ఉంటోందన్నారు.
సంస్కృతి, ఆహారం, దుస్తులు, సంగీతం , సంప్రదాయాల వైవిధ్యం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోందని చెప్పారు నరేంద్ర మోదీ(PM Modi).
ఇవాళ దేశంలోని ప్రతి గ్రామం బహిరంగ మల విసర్జన రహితంగా ఉందన్నారు. విద్యుత్ నిరంతరం ఉంటోంది. మౌలిక వసతుల కల్పనకు ప్రయారిటీ ఇచ్చామన్నారు.
భారత దేశం గత 2 సంవత్సరాల నుండి 80 కోట్ల మంది పేదలకు ఉచితంగా రేషన్ అందజేస్తోందని చెప్పారు ప్రధాన మంత్రి.
Also Read : కొలువుల భర్తీలో నో కాంప్రమైజ్