Ghulam Nabi Azad : నాపై ఎలాంటి అవినీతి కేసులు లేవు – ఆజాద్

మ‌రోసారి రాహుల్ గాంధీపై సంచ‌ల‌న కామెంట్స్

Ghulam Nabi Azad : కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన కేంద్ర మాజీ మంత్రి, మాజీ సీఎం గులాం న‌బీ ఆజాద్(Ghulam Nabi Azad) భార‌తీయ జ‌న‌తా పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీని ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టారు.

త‌నపై ఎలాంటి అవినీతి, అక్ర‌మాల‌కు సంబంధించిన కేసులు లేవ‌న్నారు. పార్ల‌మెంట్ లో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా ఏడు సంవ‌త్స‌రాలుగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ అనుస‌రిస్తున్న విధానాల‌ను విమ‌ర్శించాన‌ని ఆజాద్ చెప్పారు.

తాను ఏనాడూ వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌కు దిగ‌లేద‌న్నారు. కానీ రాహుల్ గాంధీ ప‌నిగ‌ట్టుకుని వ్య‌క్తుల‌నే టార్గెట్ చేయ‌డం మొద‌లు పెట్టారంటూ ఆరోపించారు.

ఆయ‌న వ‌ల్ల‌నే పార్టీ నాశ‌న‌మైంద‌ని, అందుకే తాను పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాన‌ని చెప్పారు. కాశ్మీర్ న్యూస్ ఛాన‌ల్ కు ఇచ్చిన ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో ఆయ‌న ప‌లు అంశాల‌పై స్పందించారు.

ఇదిలా ఉండ‌గా గులాం నబీ ఆజాద్ భార‌తీయ జ‌న‌తా పార్టీకి న‌మ్మ‌క‌మైన సైనికుడిగా మారి పోయారంటూ జై రాం ర‌మేష్ కామెంట్స్ చేయ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు.

త‌న జీవిత కాలంలో తాను ఎవ‌రికీ త‌ల వంచిన దాఖలాలు లేవ‌న్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ లో రోజు రోజుకు అస‌మ్మ‌తి స్వ‌రం పెర‌గడం, జి23 ఏర్పాటుతో రాహుల్ గాంధీ త‌న‌ను టార్గెట్ చేయ‌డం మొద‌లు పెట్టారంటూ మండిప‌డ్డారు ఆజాద్(Ghulam Nabi Azad).

త‌న‌ను బీజేపీతో అంట‌క‌ట్ట‌డం చేస్తూ వ‌చ్చార‌ని సీరియ‌స్ కామెంట్స్ చేశాడు. పూర్తి కాల అధ్య‌క్షుడిని కోరుతూ తాము లేఖ రాస్తే ప్ర‌ధాని మోదీ ఆదేశాల మేర‌కు తాము రాశామంటూ ప్ర‌చారం చేశారంటూ మండిప‌డ్డారు.

Also Read : అన్నాడీఎంకే మాజీ మంత్రుల ఇళ్ల‌పై దాడులు

Leave A Reply

Your Email Id will not be published!