CM Manik Saha Tripura : త్రిపురలో ప్రభుత్వ వ్యతిరేకత లేదు – సీఎం
ఎన్నికల్లో మరోసారి పవర్ లోకి వస్తామన్న సాహా
CM Manik Saha Tripura : త్రిపురలో ప్రజలు క్లియర్ గా ఉన్నారు. వారు మరోసారి భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకే ఎన్నికల్లో రాబోయే ఫలితాల పట్ల ఎలాంటి ఆందోళన చెందడం లేదని స్పష్టం చేశారు త్రిపుర సీఎం డాక్టర్ మాణిక్ సాహా. 34 ఏళ్లపాటు సుదీర్ఘ కాలం త్రిపురలో కొలువు తీరిన వామపక్షాలకు గత ఎన్నికల్లో కోలుకోలేని షాక్ ఇచ్చింది కాషాయ పార్టీ.
ఈసారి కూడా అధికారంలోకి తప్పక వస్తామని ధీమా వ్యక్తం చేశారు సీఎం. కేరళలో కాంగ్రెస్ , కమ్యూనిస్టులు ప్రతిపక్షం, అధికార పక్షంలో ఉన్నారు. కానీ త్రిపురలో అనూహ్యంగా తమను ఓడించేందుకు ఇద్దరూ ఒక్కటయ్యారు. అయినా తమకు వచ్చే నష్టం ఏమీ లేదన్నారు సీఎం మాణిక్ సాహా.
గతంలో అరాచక పాలన సాగించారు. ప్రజలకు జవాబుదారీతనం అంటూ లేకుండా పోయింది. కానీ తాము పవర్ లోకి వచ్చాక ప్రజలకు మెరుగైన పరిపాలన అందించడం జరిగిందని చెప్పారు త్రిపుర సీఎం డాక్టర్ మాణిక్ సాహా. ప్రస్తుతం రాష్ట్రంలో అధికార వ్యతిరేకత ఎంత మాత్రం లేదన్నారు. 2018లో వచ్చిన సీట్ల కంటే బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయని జోష్యం చెప్పారు మాణిక్ సాహా(CM Manik Saha Tripura).
త్రిపురంలో 60 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రజలు తమ పట్ల సానుకూలంగా ఉన్నారని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఓటర్లు తమ విలువైన ఓటును ఉపయోగించు కోవాలని డాక్టర్ మాణిక్ సాహా పిలుపునిచ్చారు. ఎన్నికల్లో తామే గెలుస్తామన్న నమ్మకం మాకు ఉందన్నారు. గతంలో కంటే ఈసారి ఎక్కువ సీట్లు వస్తాయన్నారు త్రిపుర సీఎం(CM Manik Saha Tripura).
Also Read : త్రిపురలో గెలుపు ఖాయం – మోదీ