Jairam Ramesh : కాంగ్రెస్ లేకుండా ప్రతిపక్ష కూటమి లేదు
స్పష్టం చేసిన కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్
Jairam Ramesh : కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, మీడియా ఇన్ ఛార్జ్ జైరామ్ రమేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ లేకుండా ఈ దేశంలో ప్రధాన ప్రతిపక్ష కూటమి అన్నది లేనే లేదని స్పష్టం చేశారు. కొన్ని పార్టీలు లేదా కొందరు నాయకులు తమంతకు తాముగా కూటమిని ఏర్పాటు చేసే పనిలో ఉన్నారని కానీ ఎవరైనా సరే దేశంలో బీజేపీని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ పార్టీతో కలవాల్సిందేనని పేర్కొన్నారు జైరామ్ రమేష్(Jairam Ramesh).
ఈ దేశంలో మతం పేరుతో రాజకీయం కొనసాగుతోందని ఇది ఎంత మాత్రం దేశానికి మంచిది కాదన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర భారత దేశ చరిత్రలో చిరస్మరణీయంగా మిగిలి పోతుందన్నారు . కల్లోలమైన జమ్మూ కాశ్మీర్ లో సైతం ప్రజలు ప్రశాంతమైన జీవితాన్ని కోరుకుంటున్నారని చెప్పారు.
135 ఏళ్ల సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర కలిగిన పార్టీని తక్కువగా అంచనా వేయొద్దని హెచ్చరించారు జైరామ్ రమేష్. బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్షాల వేదిక ఏదైనా రెండు వాస్తవాలపై ఆధారపడి ఉండాలని అభిప్రాయపడ్డారు. ఇందులో ఒకటి ఏదైనా ప్రతిపక్ష కూటమికి కాంగ్రెస్ మూలాధారం కావాలన్నారు.
కాంగ్రెస్ లేకుండా ప్రతిపక్ష కూటమి ఏదీ సంబంధితమైనది లేదా అర్థవంతమైనది కాదన్నారు. సానుకూల, నిర్మాణాత్మక ఎజెండాపై ఆధారపడి ఉండాలన్నారు జైరామ్ రమేష్(Jairam Ramesh).
కాంగ్రెస్ పార్టీ లేకుండా ప్రతిపక్ష కూటమి ఏదీ సంబంధితమైనది లేదా అర్థవంతమైనది కాదన్నారు. జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నారు. వారి డిమాండ్ లో న్యాయం ఉందన్నారు జైరామ్ రమేష్.
Also Read : రేపటితో ముగియనున్న జోడో యాత్ర