DJ Tillu Movie : ఈ స‌క్సెస్ వెనుక ఎంతో దుఖఃం ఉంది

డిజే టిల్లు సినిమా సిద్దూ జొన్న‌ల‌గ‌డ్డ

DJ Tillu Movie : సిద్దూ జొన్న‌ల‌గ‌డ్డ న‌టించిన డీజే టిల్లు మూవీ ఊహించ‌ని రీతిలో స‌క్సెస్ అయ్యింది. రెండు తెలుగు రాష్ట్రాల‌తో పాటు ఓవ‌ర్సీస్ లో కూడా క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తోంది.

గ‌తంలో కొన్ని సినిమాల‌లో న‌టించిన‌ప్ప‌టికీ వాటికి రానంత హైప్ డీజే టిల్లు కు వ‌చ్చింది. భారీ స‌క్సెస్ టాక్ రావ‌డంతో చిత్ర బృందం స‌క్సెస్ టూర్ చేస్తోంది.

ఇందులో భాగంగా ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో టిల్లూ అండ్ టీం సెల‌బ్రేష‌న్స్ చేసుకుంటోంది. సిద్దూ ఎక్క‌డికి వెళ్లినా యూత్ పెద్ద ఎత్తున ఆద‌రిస్తున్నారు.

చిన్నా పెద్దా అన్న‌ది తేడా లేకుండా మూవీని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మూవీలో సిద్దూతో పాటు నేహా శెట్టి జంట‌గా న‌టించారు. విమ‌ల్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

రామ్ మిర్యాల డీజే టిల్లు(DJ Tillu Movie) పాట పాడారు. దీనిని కాస‌ర్ల శ్యాం రాశారు. ప్ర‌స్తుతం ఈ సాంగ్ షేక్ చేస్తోంది. నిర్మాత‌, ద‌ర్శ‌కుడు, న‌టుడు, న‌టి స‌క్సెస్ టూర్ లో క‌లిసి సాగుతున్నారు.

సిద్దూను చూసి డీజే టిల్లు అంటూ కేక‌ల‌తో హోరెత్తించారు. ప్రేక్ష‌కుల‌తో క‌లిసి సినిమా చూశారు. ఈ స‌క్సెస్ రావ‌డం వెనుక ఎన్నో ఏళ్ల పాటు శ్ర‌మించాం. ఒక ర‌కంగా ఎన్నో ఒంట‌రి రాత్రులు ఉన్నాయ‌న్నాడు.

ప‌ని చేసుకుంటూ పోవ‌డమే త‌న‌కు తెలిసిన పాఠం అన్నారు సిద్దూ. ఇక డీజే టిల్లు సక్సె స్ ను మీతో పంచుకోవ‌డం చాలా సంతోషం క‌లిగిస్తోంద‌న్నాడు. డీజే టిల్లు అంటూ ఎక్క‌డికి వెళ్లినా పిలుస్తున్నారు. ఆద‌రించినందుకు థ్యాంక్స్ అన్నాడు సిద్దూ.

Also Read : 25న రానున్న భీమ్లా నాయ‌క్

Leave A Reply

Your Email Id will not be published!