IIT Reservations : ఐఐటీల్లో రిజర్వేషన్లు ఉండాల్సిందే
స్పష్టం చేసిన సుప్రీంకోర్టు
IIT Reservations : భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఇప్పటికే దేశంలో ఎక్కడా లేనంతటి పోటీ ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ (ఐఐటీ)లకు ఉంది. ప్రపంచంలో టాప్ కంపెనీలన్నీ ఈ ప్రముఖ విద్యా సంస్థల్లో చదువుకున్న వారికి ఎర్ర తివాచీలు పరుస్తాయి. కోట్లల్లో వేతనాలు ఇచ్చి నియమించుకుంటాయి.
ఈ మేరకు ఐఐటీల్లో రిజర్వేషన్లు(IIT Reservations) ఎందుకు అన్న ప్రశ్నపై పెద్ద ఎత్తున దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ప్రతిభ ఉన్న వాళ్లకు కులం, మతం ప్రాతిపదికన రిజర్వేషన్లు అవసరమా అన్న వివాదం మొదలైంది. దీంతో ఐఐటీలలో రిజర్వేషన్లకు సంబంధించిన విషయంలో సుప్రీంకోర్టు ఇవాళ కీలక తీర్పు ఇచ్చింది.
పరిశోధనలకు చెందిన సీట్లకు సంబంధించిన ప్రవేశాలు, అధ్యాపక నియామకాల్లో రిజర్వేషన్లు తప్పనిసరిగా అమలు చేయాల్సిందేనని తీర్పు చెప్పింది. ఈ తీర్పు సంచలనం కలిగించింది. ఇదిలా ఉండగా ఐఐటీ నియామకాలకు సంబంధించి రిజర్వేషన్లు పాటించడం లేదని, తప్పనిసరిగా చేయాలని కోరుతూ ఎస్ ఎన్ పాండే అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.
దీంతో దావాకు సంబంధించి ఇవాళ విచారణ చేపట్టింది ధర్మాసనం. రూల్స్ కు విరుద్దంగా నియామకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇరు తరపున వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ ఎం. ఆర్. షా, జస్టిస్ సీటీ రవికుమార్ తో కూడిన ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది.
కచ్చితంగా రిజర్వేషన్లు ఉండాల్సిందేనని పేర్కొంది. ఏ మాత్రం అమలు చేయక పోయినా తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది.
Also Read : పాత్రికేయ రచన సాహిత్యానికి ముప్పు