Imran Khan : దేశంలో దొంగలు పడ్డారు – ఇమ్రాన్ ఖాన్
పాకిస్తాన్ పై అణుబాంబు వేస్తే బెటర్
Imran Khan : పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి, మాజీ క్రికెట్ జట్టు కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో దొంగలు పడ్డారని, వీరి చేతిలో పాలన కంటే పాకిస్తాన్ పై ఏకంగా ఒకే సారి అణ్వాయుధాలు ప్రయోగిస్తే బాగుంటుందని అన్నారు.
దేశంపై దొంగలు రెచ్చి పోవడం చూసి తాను షాక్ కు గురైనట్లు చెప్పారు. ఇంతమందికి పగ్గాలు ఇవ్వడం కంటే ఒకేసారి అణుబాంబు వేస్తే సరి పోతుందన్నారు. ఇమ్రాన్ ఖాన్(Imran Khan) బనిగల నివాసంలో మీడియాతో మట్లాడుతూ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. గత పాలకులు చేసిన అవినీతి గురించి కథలు కథలుగా తనకు చెప్పిన నాయకులే తిరిగి తనకు నీతులు చెప్పే స్థాయికి చేరుకున్నారంటూ ఎద్దేవా చేశారు.
అధికారంలోకి వచ్చిన దొంగలు ప్రతి సంస్థను, న్యాయ వ్యవస్థను నాశనం చేశారని , ఇప్పుడు ఏ ప్రభుత్వ అధికారి నేరస్థుల కేసులను విచారిస్తారని ఇమ్రాన్ ఖాన్ ప్రశ్నించారు.
ఇదిలా ఉండగా ఖాన్ చేసిన కామెంట్స్ పై సీరియస్ గా స్పందించారు నూతన ప్రధానిగా కొలువు తీరిన షెహబాజ్ షరీఫ్. ఇమ్రాన్ ఖాన్(Imran Khan) ప్రభుత్వ సంస్థలను లక్ష్యంగా చేసుకుని తన ప్రసంగాలతో పాక్ ప్రజల మనసుల్లో విషయం నింపుతున్నారంటూ మండిపడ్డారు.
ఆయన పదే పదే ప్రతిపక్షాలను దొంగలు అంటూ సంబోదించడం మంచి పద్దతి కాదని సూచించారు పీఎం. ఈనెల 20న జరగనున్న లాంగ్ మార్చ్ సందర్భంగా సమాఖ్య రాజధానిలోకి ప్రవేశించ కుండా ఏ శక్తీ ఆప లేదంటూ పీటీఐ చైర్మన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Also Read : యూఏఇ చీఫ్ గా షేక్ మొహమ్మద్ బిన్