Owaisi : తెలంగాణలో బీజేపీకి మూడో ప్లేస్
కండోమ్ లు వాడకంలో మేమే టాప్
Owaisi : ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ దేశంలో హిందువుల కంటే ముస్లింలే ఎక్కువగా కండోమ్ లు వాడుతున్నారని అన్నారు. ఈ విషయాన్ని మాత్రం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాత్రం ఎక్కడా ప్రస్తావించరంటూ నిప్పులు చెరిగారు.
హైదరాబాద్ లో జరిగిన ఓ సమావేశంలో ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు ఓవైసీ(Owaisi). దీనిపై దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ సీరియస్ గా స్పందించారు. ఓవైసీ సమాజంలో సామరస్యంగా ఉన్న హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టేందుకు ఇలా చేస్తున్నారంటూ ఆరోపించారు.
దేశంలో మత సామరస్యం కాపాడేందుకు ఎనలేని కృషి చేస్తున్న ఆర్ఎస్ఎస్ చీఫ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తప్పు పట్టారు. ఇది మంచి పద్దతి కాదని పేర్కొన్నారు. వచ్చే ఏడాది తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు జరగబోతున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీతో ఎంఐఎం దోస్తీ చేస్తోంది.
దీంతో బీజేపీపై కావాలని ఆరోపణలు చేస్తూ టీఆర్ఎస్ కు లబ్ది చేకూర్చేలా చేస్తున్నారంటూ బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. ఇదిలా ఉండగా దేశంలో హిందువులు, ముస్లింలకు మధ్య ఉద్రిక్తతలు సృష్టించడం తప్ప భారతీయ జనతా పార్టీ చేసింది ఏమీ లేదని పేర్కొన్నారు అసదుద్దీన్ ఓవైసీ. తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీకి మూడో స్థానం తప్ప ఇంకేమీ ఉండదన్నారు.
Also Read : మునుగోడులో గెలుపు బీజేపీకి మలుపు