Joe Biden : ఇంకెంత కాలం ఈ మార‌ణహోమం – బైడెన్

అమెరికాలో వ‌రుస కాల్పుల‌పై ఆగ్ర‌హం

Joe Biden : ఇలా ఇంకెంత కాలం భ‌రిద్దాం. ఎలాంటి కార‌ణాలు లేకుండా కాల్పుల‌కు తెగ‌బ‌డ‌టం. దీనిని మ‌నం ఇంకెన్ని రోజులు భ‌రించాల‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు అమెరికా దేశ అధ్య‌క్షుడు జోసెఫ్ బైడెన్(Joe Biden).

ఇది అత్యంత బాధాక‌రం. రోజు రోజుకు కాల్పుల మోత‌ల‌తో దేశం అట్టుడుకుతోంది. అస‌లు ప్ర‌పంచానికి మ‌నం ఏం సందేశం ఇవ్వాల‌ని అనుకుంటున్నామో చెప్పాల‌ని నిల‌దీశారు.

మొన్న‌టికి మొన్న 19 మంది పిల్ల‌ల‌ను పొట్ట‌న పెట్టుకున్నారు. హాస్పిట‌ల్ లో మ‌రో న‌లుగురు..ఇలా చెప్పుకుంటూ పోతే గ‌త కొంత కాలం నుంచీ వ‌రుస‌గా కాల్పులు ఎక్క‌డో ఒక చోట కొన‌సాగుతూనే ఉన్నాయి.

వీటిని ఇలాగే భ‌రిస్తూ..చూస్తూ వెళ్లి పోదామా. ఇలా మ‌న వాళ్ల‌కు జ‌రిగితే మౌనంగా ఊరుకుంటామా అని నిల‌దీశారు బైడెన్(Joe Biden). ఆయ‌న తీవ్ర భావోద్వేగానికి గుర‌య్యారు.

ఇక నుంచైనా దేశంలో క‌ఠిన‌త‌ర‌మైన తుపాకీ చ‌ట్టాల‌ను తీసుకు రావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. తాము ఇక నుంచి మార‌ణ హోమాన్ని లేదా కాల్పుల‌కు తెగ బ‌డ‌టాన్ని స‌హించే ప్ర‌స‌క్తి లేద‌ని బైడెన్ హెచ్చ‌రించారు.

యుఎస్ లో తుపాకీల‌ను నిషేధించాల‌ని కోరుతూ ప్రెసిడెంట్ వైట్ హౌస్ నుంచి ప్రైమ్ టైమ్ టెలివిజ‌న్ లో జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించారు. ఇది ఎంత మాత్రం క్షమించ‌రాని నేరంగా ఆయ‌న అభివ‌ర్ణించారు.

కాగా తుపాకీ చ‌ట్టాల‌ను రూపొందించేందుకు రిప‌బ్లిక‌న్ సెనేట‌ర్లు నిరాక‌రించ‌డాన్ని ఆయ‌న తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. మీరు ఎవ‌రి వైపు ఉన్నారో దేశ ప్ర‌జ‌ల‌కు అర్థం అవుతోంద‌న్నారు.

ఇక‌నైనా త‌మ త‌ప్పు తెలుసుకుని క‌ఠిన‌మైన చ‌ట్టానికి స‌హ‌క‌రించాల‌ని బైడెన్ కోరారు. వారికి మ‌న‌స్సాక్షి అన్న‌ది లేకుండా పోయింద‌న్నారు.

ఆయుధాల‌ను కొనుగోలు చేసే వ‌య‌స్సును 18 నుండి 21 సంవ‌త్స‌రాల‌కు పెంచాల‌ని సూచించారు.

Also Read : యుఎస్ లో కాల్పులు న‌లుగురు మృతి

Leave A Reply

Your Email Id will not be published!