Rajendra Pal Gautam : ఈ దేశానికి అంబేద్క‌ర్ అవ‌స‌రం – గౌత‌మ్

సంచ‌ల‌న కామెంట్స్ చేసిన మాజీ మంత్రి

Rajendra Pal Gautam : ఈ దేశం ఎటు పోతోందో అర్థం కావ‌డం లేదు. ఒక్కోసారి అన్యాయమే ఆధిప‌త్యం వ‌హిస్తుంది. ఇవాళ ఎవ‌రు అవున‌న్నా కాద‌న్నా బుద్దుడు, అంబేద్క‌ర్ త‌ప్ప‌నిస‌రి ఏదో ఒక ప‌రిస్థితిలో, ఏదో ఒక స‌మ‌యంలో అవ‌స‌రం అవుతార‌ని స్ప‌ష్టం చేశారు ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ మంత్రి రాజేంద్ర పాల్ గౌత‌మ్.

డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేద్క‌ర్ అనే మ‌హానుభావుడు లేక పోతే నాలాంటి వారు ఇలా మాట్లాడి ఉండే వారు కాద‌న్నారు. బుధ‌వారం త‌న‌ను విచార‌ణ‌కు పిలిపించిన సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడారు. త‌న‌కు సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ నుంచి మ‌ద్ద‌తు లేక పోవ‌డంపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

ఒక్కోసారి మౌనంగా ఉండ‌డం కూడా అత్యంత అవ‌స‌ర‌మ‌ని పేర్కొన్నారు. భార‌త రాజ్యాంగం ప‌ట్ల గౌర‌వం లేని వాళ్లు చేసిన కుట్ర ఇది. ఇంత‌కంటే ఏం చెప్ప‌గ‌ల‌మ‌న్నారు గౌత‌మ్. ఆవేశంలో తొంద‌ర‌పాటు ప్ర‌క‌ట‌న‌ల కంటే మౌనంగా ఉండ‌ట‌మే బెట‌ర్ అని పేర్కొన్నారు. బౌద్ద కార్య‌క్ర‌మంలో హిందూ వ్య‌తిరేక ప్ర‌మాణం చేసినందుకు ఆయ‌న త‌నంత‌కు తానుగా మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేశారు.

ఆయ‌న‌ను పార్టీ నుండి , కేబినెట్ నుండి తొల‌గించాల‌ని బీజేపీ డిమాండ్ చేసింది. ఆపై పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై మాజీ మంత్రికి నోటీసులు అంద‌జేశారు. తాను కేవ‌లం బిఆర్ అంబేద్క‌ర్ పాటించిన 22 ప్ర‌మాణాల‌ను ప‌ఠిస్తున్న‌ట్లు చెప్పారు రాజేంద్ర పాల్ గౌత‌మ్(Rajendra Pal Gautam).

గుజ‌రాత్ లో బీజేపీ ఓడిపోతోంది. అందుకే ఆ పార్టీ హిందూ కార్డ్ ను ప్లే చేస్తోంద‌న్నారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు, విద్వేష పూరిత వాతావ‌ర‌ణాన్ని సృష్టించేందుకు బీజేపీ ప‌ని చేస్తోంద‌న్నారు.

Also Read : వ‌ర‌ద ప‌రిస్థితిపై సీఎం యోగి ఆరా

Leave A Reply

Your Email Id will not be published!