PM Narendra Modi : ఎగ‌తాళి చేసిన వారే విస్తు పోతున్నారు – మోదీ

ఆత్మ నిర్భ‌ర్ భార‌త్ పై ప్ర‌ధానమంత్రి కామెంట్

PM Narendra Modi : దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Narendra Modi) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. శ‌నివారం దేశ రాజ‌ధాని ఢిల్లీలో మొబైల్ కాంగ్రెస్ ఈవెంట్ ను ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా దేశంలో కీల‌కంగా మారిన 5జీ స‌ర్వీసుల‌ను ప్రారంభించి ప్ర‌సంగించారు. తాను ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్రారంభించిన ఆత్మ నిర్భ‌ర్ భార‌త్ విజ‌న్ ను చాలా మంది ఎగ‌తాళి చేశార‌ని అన్నారు.

కానీ దాని ఫ‌లితాలు ఇవాళ క‌నిపిస్తున్నాయ‌ని చెప్పారు. ప్ర‌తిప‌క్షాలు ఇవాళ ఆచ‌ర‌ణ‌లోకి వ‌చ్చిన టెక్నాల‌జీని చూసి విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నాయ‌ని అన్నారు. 2014లో కేవ‌లం 2 మొబైల్ త‌యారీ యూనిట్లు దేశంలో ఉన్నాయ‌ని కాగా తాము ప‌వ‌ర్ లోకి వ‌చ్చాక గ‌త ఎనిమిది సంవ‌త్స‌రాల‌లో వాటి సంఖ్య 200 దాటింద‌ని వెల్ల‌డించారు మోదీ.

డిజిట‌ల్ , ఆత్మ నిర్భ‌ర్ భార‌త్ దృష్టిలో ఇది ఒక ప్ర‌ధాన అడుగు అని పేర్కొన్నారు. నా విజ‌న్ ను ఎగ‌తాళి చేశారు. టెక్నాల‌జీ పేద‌ల కోసం కాద‌ని ప్ర‌జ‌లు భావించే వారు. కానీ సాంకేతిక‌త అనేది ప్ర‌తి ఇంటికి చేరాల‌న్న‌ది నా క‌ల నా ఆశ‌యం. ఇది చేరుతుంద‌ని మొద‌టి నుంచీ నాకు గ‌ట్టి న‌మ్మ‌కం. నా అంచనా త‌ప్ప‌లేదు.

ఇవాళ సాక్షాత్కార‌మైంది. ఒక ర‌కంగా చెప్పాలంటే 5జీ టెక్నాల‌జీ దేశంలోనే చ‌రిత్రాత్మ‌కమ‌ని స్ప‌ష్టం చేశారు న‌రేంద్ర మోదీ. ఈ టెక్నాల‌జీ టెలికాం రంగంలో విప్ల‌వాత్మ‌క‌మైన మార్పును తీసుకు వ‌స్తుంద‌న్నారు. ఇది డిజిట‌ల్ ఇండియా సాధించిన విజ‌య‌మ‌న్నారు ప్ర‌ధాన‌మంత్రి. వైర్ లెస్ టెక్నాల‌జీ రూప‌క‌ల్ప‌న‌లో కీల‌కంగా మార‌నుంద‌న్నారు.

Also Read : 5జీ టెస్టింగ్ మోదీ కారు డ్రైవింగ్ స‌క్సెస్

Leave A Reply

Your Email Id will not be published!