Three Terrorists : ఓ వైపు భారత ప్రధాన మంత్రి జమ్మూ , కాశ్మీర్ లోని పల్లిలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఇదే సమయంలో పుల్వామాలో ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది.
లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు(Three Terrorists )హతమయ్యారు. పాహూ ప్రాంతంలో ఉగ్రవాదాలు ఉన్నట్లు గుర్తించారు. భద్రతా దళాలు అక్కడ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. దీంతో విషయం తెలుసుకున్న ఉగ్రవాదులు భారత దళాలపై కాల్పులకు తెగ బడ్డాయి.
దీంతో మన దళాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఎల్టిఈకి చెందిన ఉగ్రవాదులు ఎన్ కౌంటర్ లో మరణించినట్లు ఓ పోలీస్ ఉన్నతాధికారి వెల్లడించారు.
సెర్చ్ ఆపరేషన్ ఎన్ కౌంటర్ (Three Terrorists )కు దారి తీసిందని తెలిపారు. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది. నిషిద్ధ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకి అనుబంధంగా ఉన్న ముగ్గురిని మట్టు బెట్టారు.
ఈ ప్రాంతంలో వీరి కదలికలు ఎక్కువ కావడంతో సమాచారం అందుకున్నారు భారత దళాలు. 2019లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత పీఎం మోదీ కేంద్ర పాలిత ప్రాంతాన్ని సందర్శించిన ఒక రోజున ఈ ఎన్ కౌంటర్ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అంతకు ముందు మోదీ రిమోట్ గా ఒక టన్నెల్ ను ప్రారంభించారు. రెండు జల విద్యుత్ ప్రాజెక్టు పనులను ప్రారంభించారు. గతంలో 17 వేల కోట్లు మంజూరు చేస్తే తాము రూ. 38 వేల కోట్లు మంజూరు చేశామన్నారు మోదీ ఈ సందర్భంగా.
కాగా పీఎం టూర్ సందర్భంగా భారీగా సెక్యూరిటీ ఏర్పాటు చేశారు.
Also Read : సైనిక వ్యయంలో టాప్ 3లో ఇండియా