Amnesia Pub Case : గ్యాంగ్ రేప్ కేసులో మరొకరు అరెస్ట్
వక్ఫ్ బోర్డు చైర్మన్ తనయుడు అదుపులో
Amnesia Pub Case : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ అమ్నీషియా పబ్ కేసు(Amnesia Pub Case) లో అప్ డేట్ వచ్చింది. ఈ కేసు తెలంగాణలో చర్చకు దారి తీసింది.
మైనర్ బాలికపై ఐదుగురు అత్యాచారానికి పాల్పడ్డారని వీరిలో ఇద్దరు మేజర్లు ఉండగా ముగ్గురు మైనర్లు ఉన్నారని వెస్ట్ జోన్ డీసీపీ వెల్లడించారు.
బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు చెప్పారు.
బాలిక రేప్ కేసులో అరెస్ట్ అయిన వారిలో ఒక మేజర్ , ఇద్దరు మైనర్లు ఉన్నారని వెల్లడించారు. 18 ఏళ్ల సాజిద్ మాలిక్ , వక్ఫ్ బోర్డు చైర్మన్ 16 ఏళ్ల తనయుడు, మరో మైనర్ ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించారు. పరారీలో ఉన్న మరో ఇద్దరిని పట్టుకుంటామని వెల్లడించారు. కాగా దీనిపై పెద్ద ఎత్తున రాద్ధాంతం రేగింది. వెస్ట్ జోన్ డీసీపీ చెప్పిన దాంట్లో వాస్తవం లేదని ఆరోపించారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు.
కారులో ఎమ్మెల్యే కొడుకు ఉన్నాడని ఆరోపించారు. ఇందుకు సంబంధించి ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఆధారాలు కూడా చూపించారు. ఫోటోలు, వీడియో క్లిప్పింగ్ కూడా బహిరంగ పరిచారు.
బడా బాబుల కుటుంబాల కోసం వాస్తవాలను ఎలా దాచి పెడతారంటూ నిలదీశారు. సీసీ ఫుటేజ్ లో ఏది మార్చినా తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు.
ప్రస్తుతం రఘునందన్ రావు వెల్లడించిన ఫోటోలు, వీడియో వైరల్ గా మారింది.
Also Read : గ్యాంగ్ రేప్ కేసులో ఐదుగురు నిందితులు