Modi : నేపాల్ తో బంధం బలమైనది – మోదీ
లుంబిని బౌద్ధ సదస్సులో ప్రధానమంత్రి
Modi : భారత్ నేపాల్ దేశాల మధ్య బందం బలీయమైనదని అన్నారు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Modi). బుద్ద పూర్ణిమను పురస్కరించుకుని నేపాల్ ప్రధాన మంత్రి ఆహ్వానం మేరకు ప్రధాని సోమవారం నేపాల్ లో పర్యటిస్తున్నారు.
ఆయనకు ఘన స్వాగతం లభించింది. మాయాదేవి ప్రార్థనా మందిరాన్ని సందర్శించారు. అనంతరం లుంబినీలో జరిగిన బౌద్ధ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు.
భారతదేశం, నేఆపల్ లు ఎప్పటికీ విడి పోవన్నారు. రోజు రోజుకు ఇరు దేశాల మధ్య బంధం మరింత బలపడుతోందని చెప్పారు. ఈ స్నేహం, సాన్నిహిత్యం మొత్తం మానవాళికి ఉపయోగ పడుతుందని స్పష్టం చేశారు మోదీ.
ప్రధాన మంత్రి షేర్ బహూదర్ దేవుబా తనను ఆహ్వానించడం తనకు ఎంతో సంతోషం కలిగించిందన్నారు. ఉద్భవిస్తున్న ప్రపంచ పరిస్థితుల మధ్య ఇలా ప్రసంగించడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు మోదీ(Modi).
ఇరు దేశాల మధ్య ఉన్న మైత్రిని ఆయన హిమాలయాలంత స్వచ్ఛమైనవిగా పేర్కొన్నారు. బుద్దుడు ఈ భువిపై ఉద్భవించిన మహోన్నత మానవుడని కీర్తించారు.
మానవత్వంపై సామూహిక అవగాహనకు ప్రతిరూపమని కొనియాడారు దేశ ప్రధాన మంత్రి. బుద్ద భగవానుడి పట్ల ఉన్న భక్తి మనల్ని ఒకదానితో మరొకటి కలిపేలా చేస్తుందన్నారు.
ఒకే కుటుంబంలో సభ్యులను చేస్తుందన్నారు నరేంద్ర మోదీ. బుద్దుడు జన్మించిన ప్రదేశం అత్యంత శక్తివంతమైన అనుభూతిని కలిగిస్తోందన్నారు.
ఈ స్థలం కోసం 2014లో తాను బహుమతిగా ఇచ్చిన మహా బోధి మొక్క ఇప్పుడు చెట్టుగా మారిందని, దానిని చూసి తాను సంతోషానికి లోనవుతున్నానని చెప్పారు ప్రధాన మంత్రి.
Also Read : ఉత్తర కొరియాను వణికిస్తున్న కరోనా